శరద్ పవార్ కీలక నిర్ణయం-కూతురు సుప్రియ, ప్రఫుల్ పటేల్ కు పగ్గాలు ?

రాజకీయ కురువృద్ధుడు, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తన రాజకీయ భవితవ్యంపై సందిగ్ధత కొనసాగుతున్న వేళ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఓసారి పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి సంచలనం రేపిన పవార్, అనంతరం దాన్ని వెనక్కి తీసుకున్నారు. ఇప్పుడు తాను ఎన్సీపీ ఛీఫ్ గా కొనసాగుతూనే కుమార్తె, పార్టీ ఎంపీ సుప్రియా సూలే, మరో సీనియర్ నేత ప్రఫుల్ పటేల్ ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమించారు.

1999లో తాను, పీఏ సంగ్మా కలిసి స్థాపించిన పార్టీ 25వ వార్షికోత్సవంలో శరద్ పవార్ ఈ విషయాన్ని ప్రకటించారు.బారామతి ఎంపీ సుప్రియా సూలేకు మహారాష్ట్ర, హర్యానా, పంజాబ్, మహిళా యువత, లోక్‌సభ సమన్వయం బాధ్యతలు అప్పగించగా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గోవా బాధ్యతలను ప్రఫుల్ పటేల్ చూసుకుంటారని పవార్ వెల్లడించారు. ఎన్సీపీలో కీలకంగా ఉన్న అజిత్ పవార్ సమక్షంలోనే ఈ ప్రకటన వెలువడింది.

 supriyasuleprafulpatel

ఎన్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ తట్కరేకు ఒడిశా, పశ్చిమ బెంగాల్, రైతులు, మైనారిటీ శాఖల బాధ్యతలు అప్పగించారు. ఢిల్లీ ఎన్సీపీ అధినేతగా నంద శాస్త్రిని నియమించినట్లు శరద్ పవార్ ప్రకటించారు. ఈ ప్రకటన వెలువడిన తర్వాత, సుప్రియా సూలే మాట్లాడుతూ పార్టీకి తాను కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు.

శరద్ పవార్ గత నెలలో పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తానని ప్రతిపాదించారు. ఆ తర్వాత పార్టీ సభ్యులతో పాటు ఇతర రాజకీయ నాయకుల నుండి తీవ్ర నిరసనలు వచ్చాయి. పార్టీ కార్యకర్తలు తన నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి నిరసన వ్యక్తం చేయడంతో పవార్ జాతీయ అధ్యక్ష పదవికి రాజీనామాను వెనక్కి తీసుకున్నారు. పవార్ ఆఫర్‌పై చర్చించేందుకు ఏర్పాటైన ఎన్‌సీపీ ప్యానెల్ మే 5న ఆయన రాజీనామాను తిరస్కరించి, పార్టీ అధ్యక్షుడిగా కొనసాగాలని కోరింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+