కేజ్రీవాల్ వ్యాఖ్యలను సమర్ధించిన జేడీయూ చీఫ్ శరద్ యాదవ్
న్యూఢిల్లీ: బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి డబ్బు తీసుకుని... ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటు వేయడంటూ ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలను జేడీయూ పార్టీ అధినేత శరద్ యాదవ్ సమర్ధించారు. ఈ అంశంపై స్పందిస్తూ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని చెప్పారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారంటూ కేజ్రీవాల్‌కు ఎన్నికల సంఘం మంగళవారం నోటీసు జారీ చేసింది.
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు ఆయనకు నోటీసు పంపింది. ఎల్లుండి(గురువారం)లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పశ్చిమ ఢిల్లీలోని నవాడలో ఆదివారం ప్రచారంలో పాల్గొన్న కేజ్రీవాల్..

‘ఇది ఎన్నికల సమయం. బీజేపీ, కాంగ్రెస్‌ల నుంచి అభ్యర్థులు డబ్బులిస్తాం... ఓటేయమంటూ మీ వద్దకు వస్తారు. ఆ డబ్బును వద్దనకండి. తీసుకోండి. ఎవరైనా మీ వద్దకు రాకపోతే.. మీరే వారి పార్టీ ఆఫీసుల దగ్గరకు వెళ్లి మరీ డబ్బులు వసూలు చేయండి. ఆ రెండు పార్టీల నుంచి డబ్బులు తీసుకోండి. కానీ ఓటు మాత్రం ఆప్‌కే వేయండి' అని అన్నారు.
‘గత 65 ఏళ్లుగా మనల్ని పిచ్చోళ్లను చేస్తున్న ఆ నేతలను ఈ సారి మనం ఫూల్స్ చేద్దామ'న్న విషయం తెలిసిందే. కేజ్రీవాల్ వ్యాఖ్యలపై ఈసీకి ఫిర్యాదు చేశామని కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ తెలిపారు. కేజ్రీవాల్ వ్యాఖ్యలు బాధ్యతారహితమే కాకుండా రాజ్యాంగ విరుద్దమన్నారు. లంచం ఇవ్వడం, తీసుకోవడం నేరం అన్న సంగతి గుర్తుంచుకోవాలన్నారు.
ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ బుధవారం నాడు నామినేషన్ దాఖలు చేశారు. న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి పోటీ చేసేందుకు జామ్ నగర్ కలెక్టర్ కార్యాలయంలో ఆయన నామినేషన్ పత్రాలు సమర్పించారు.












Click it and Unblock the Notifications