థర్డ్ ఫ్రంట్లోకి జగన్‌పై శరద్ యాదవ్, టి బిల్లుపై హామీ

Sharad Yadav promises YS Jagan
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ విభజనపై ఒక ఉమ్మడి విధానం అవలంభిస్తామని జెడి(యు) అధ్యక్షులు శరద్ యాదవ్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డికి హామీ ఇచ్చారు. శరద్ యాదవ్‌తో జగన్ శనివారం భేటీ అయిన విషయం తెలిసిందే. పార్టీ నాయకులు మేకపాటి రాజమోహన్ రెడ్డి, మైసూరా రెడ్డి, ఎస్పీవై రెడ్డి ఆయన వెంట ఉన్నారు.

ఈ సందర్భంగా శరద్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ, సీమాంధ్రపై థర్డ్ ఫ్రంట్‌లోని 11 పార్టీలతో చర్చించి, ఏకాభిప్రాయం తెచ్చేందుకు ప్రయత్నం చేస్తామని తెలిపారు.

ఎంపీలు మర్యాదలు దాటి వ్యవహరిస్తే ప్రజాస్వామ్యం నడవదని, లోక్‌సభ సంఘటనను ఖండించి వదిలేయబోమన్నారు. ఎంపీల సస్పెన్షన్‌పై స్పీకర్ మీరా కుమార్‌తో మాట్లాడతానన్నారు. జగన్‌ను కూడా థర్డ్ ఫ్రంట్‌లోకి పిలవాలని భావించామని, తర్వాత ఏమీ చర్చ జరగలదేన్నారు.

కాగా, కేవలం పది సెకన్లలో మొత్తం తతంగం ముగించేశారని వైయస్ జగన్ లోకసభలో తెలంగాణ బిల్లు ప్రతిపాదనపై వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. శరద్ యాదవ్‌తో సమావేశమైన అనంతరం ఆయన మాట్లాడారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు సహాయం చేయాలని ఆయన శరద్ యాదవ్‌ను కోరామన్నారు. తమ కూటమిలోని 11 పార్టీలు కలిసి చర్చించుకుంటాయని, ఆ తర్వాత తమ అభిప్రాయాన్ని చెబుతామని శరద్ యాదవ్‌ జగన్‌తో చెప్పారు.

బిల్లును వ్యతిరేకిస్తూ శానససభ తీర్మానం చేసినా, కేంద్రం మాత్రం మొండిగా ముందుకు వెళ్తోందని ఆయన అన్నారు. కేంద్రం సమాఖ్య స్ఫూర్తిని, ప్రజాస్వామ్యాన్ని కాదని అడుగులు వేస్తోందని ఆయన అన్నారు. ఈ అంశాలపై తాను శరద్ యాదవ్‌తో మాట్లాడినట్లు ఆయన తెలిపారు. శరద్ యాదవ్ సానుకూలంగా స్పందించారని ఆయన చెప్పారు. ప్రతిపక్షాలు ఇప్పటికైనా ఒక్కతాటి మీదికి రావాలని, ఈ అన్యాయాన్ని ఎదుర్కోవాలని జగన్ అన్నారు.

సభలో కాంగ్రెసు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. సభలో ఎక్కువ మంది చేతులెత్తితేనే దాన్ని మూజువాణీ ఓటుగా భావించి, బిల్లు ప్రవేశపెట్టడానికి ఆమోదంగా పరిగణించాలని, కానీ స్పీకర్ మీరా కుమార్ మాత్రం ఎవరినీ అడగకుండానే పది సెకన్లలో మొత్తం తతంగం ముగించారని ఆని అన్నారు. నిండు సభలో అసలు ప్రజాస్వామ్యమే లేకుండా పోయిందని, ఈ వ్యవహారాన్ని ఎస్పీ, అన్నాడియంకె, జెడియు సహా అన్ని పార్టీలూ వ్యతిరేకించాయని ఆయన చెప్పారు. అయినా ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదని అన్నారు.

తమను సభలో ప్రవేశించకుండా ఐదు రోజులు సస్పెండ్ చేశారని, సీమాంధ్ర ఎంపీలెవ్వరూ సభ లేకుండా చేసి రాష్ట్రాన్ని విభిజించాలని అనుకుంటున్నారని జగన్ అన్నారు. సీమాంధ్ర ఎంపిలెవ్వరూ చర్చలో పాల్గొనకుండా చేయాలన్నదే వారి ఉద్దేశమని, ఇలాంటి అన్యాయం ఎక్కడా జరిగి ఉండదని ఆయన అన్నారు. అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజిస్తున్నారని, దీనిని ఆమోదిస్తే మిగతా రాష్ట్రాలకు కూడా పాకుతుందన్నారు. కేంద్రంలో 275 సీట్లు ఉంటే ఎవరినీ అడగకుండా వాళ్లంతట వాళ్లే గీతలు గీసేస్తారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+