ఒకే వేదికపై మోడీ, నితీశ్: అభివృద్ధితోనే సమస్యలకు చరమగీతం

పాట్నా: ప్రధానమంత్రి నరేంద్రమోడీ శనివారం బీహార్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా పాట్నాలో ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఐఐటీ, పాట్నా-ముంబై రైల్వే లైన్‌ను ప్రధాని మోడీ ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మోడీ ప్రసంగించారు.

అభివృద్ధి కార్యక్రమాల్లో రాజకీయాల ప్రస్తావన సరికాదని ప్రధాని మోడీ అన్నారు. రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని, అభివృద్ధి కార్యక్రమాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పని చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. అభివృద్ధిలో రాష్ర్టాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉందని అన్నారు.

'Share Nitish Kumar's Pain, Bihar Suffered Because of Politics,' Says PM Modi

దేశ రాజధాని ఢిల్లీలో కూర్చుని పథకాలు రూపొందించడం సరికాదన్న ఆయన, రాష్ట్రాల్లోని ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని పథకాలకు రూపొందిస్తున్నామని మోడీ చెప్పారు. కొంత మంది రాజకీయ నాయకులు అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మోడీ ఆరోపించారు.

ఈ కార్యక్రమంలో బీహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌, పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు. ఈరోజు జరిగిన కార్యక్రమంలో ఓ అరుదైన దృశ్యం కనిపించింది. ఎన్డీఏ నుంచి జేడీయూ బయటకు వెళ్లాక ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం నితీశ్‌ కుమార్ ఒకే వేదికపై దర్శనమిచ్చారు.

రాష్ట్రపతికి అభినందనలు తెలిపిన ప్రధాని మోడీ

భారత రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ పదవీ బాధ్యతలు స్వీకరించి మూడు సంవత్సరాలు పూర్తయయ్యాయి. ఈ సందర్భంగా రాష్ట్రపతి భవన్‌లో కేంద్ర మంత్రులు, మరికొంతమంది అతిధులకు శనివారం విందు ఇవ్వనున్నట్లు రాష్ట్రపతి భవన్ వర్గాలు మీడియాకు వివరించాయి.

ఈ సందర్భంగా ఎంపిక చేసిన రాష్ట్రపతి ప్రసంగాలతో కూడిన రెండు పుస్తకాలను విడుదల చేయనున్నట్టు రాష్ట్రపతి భవన్ తెలిపింది. ఈ రెండు పుస్తకాలను ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, హోం మంత్రి రాజ్ నాధ్ చేతుల మీదుగా ఆవిష్కరించనున్నారు.

కాగా జూలై 25, 2015 రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రణబ్‌ ముఖర్జీ రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టి శనివారంతో మూడేళ్లు పూర్తైన సందర్భంగా శనివారం ప్రధాని నరేంద్రమోడీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రణబ్ లాంటి గొప్పవ్యక్తి దేశాధ్యక్షుడిగా ఉండటం గర్వకారణమని మోడీ ట్విట్టర్‌లో కొనియాడారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+