మోడీకి కాంగ్రెస్ నేతల మద్దతు: అవును ఆయన విధానాలు మంచివే, అభిషేక్ సింఘ్వీ,జైరాం రమేశ్,శశి థరూర్...

ప్రతి విషయంలో మోడీని విలన్ చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీకే నష్టం కల్గుతుందన్న అభిప్రాయం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతల్లో రోజురోజుకు పెరుగుతోంది. ఈనేపథ్యంలోనే మోడీ ప్రవేశ పెట్టే ప్రతి పథకాన్ని కార్యాక్రమాన్ని విమర్శించడం తప్పనే అభిప్రాయం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు బహిరంగంగానేనే వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆర్టికల్ 370ని రద్దు చేయడంపై ఓవైపు పార్లమెంట్‌లో తీవ్రంగా వ్యతిరేకిస్తే బయట ఉన్న పార్టీ సీనీయర్ నేతలు మద్దతు తెలిపిన విషయం తెలిపిందే...

తాజాగా బుధవారం పార్టీ సీనీయర్ నేత జైరాం రమేష్ ఓ బుక్ రీలీజ్ ఫంక్షన్‌లో పాల్గోన్న ఆయన మోడీ పాలన మొత్తం వ్యతిరేకించదగ్గది కాదని అన్నారు. 30శాతం ప్రజలు కూడ అదనంగా మద్దతుపలికారని అందుకే ఆయన రెండవ సారి అధికారంలోకి వచ్చారని అన్నారు.ఈనేపథ్యంలోనే మోడీ చేసిన కార్యక్రమాలను ప్రతిపక్ష పార్టీలు గుర్తించాలని, అన్నారు. ఇందకు ఉదహారణంగా పేదలకు సబ్సిడీ గ్యాస్ అందిస్తున్న ఉజాల పథకాన్ని వివరించారు. ఈ నిర్ణయం రాజకీయంగా ఆయనకు కలిసి వచ్చిందని చెప్పారు.ఇందులో బాగంగానే ప్రధాని మోడీ ప్రజల బాషా మాట్లాడతారని, దీంతో ఆయన్ను గుర్తించేందుక గతంలో చేయని అభివృద్ది పనులను ఆయన చేస్తున్నాడని వాటిని మనం గుర్తించాలని చెప్పారు.

Shashi Tharoor and Abhishek Singhvi took to Twitter to back Mr. Ramesh

పార్టీ సీనియర్‌గా ఉన్న జైరాం రమేష్ వ్యాఖ్యలను సమర్ధిస్తూ తాను ఆరు సంవత్సరాలుగా ఇదే విషయాన్ని వాదిస్తన్నానని మోడీ చేసే మంచి పనులకు ప్రశంశలు అందించాని చెబతున్నాని మరో పార్టీ సీనీయర్ నేత శశీథరూర్ కూడ మోడీ విధానాలను సమర్ధించారు. ఈ నేపథ్యంలోనే జైరాం రమేష్ చేసిన వ్యాఖ్యలను సమర్ధిస్తూ మరో సీనియర్ నేత అభిషేక్ సింఘ్వీ సైతం స్పందించారు. మోదీని విలన్‌గా చిత్రీకరించడం తప్పని చెబుతూనే ఉన్నా, ఇది ఒకరకంగా ఆయనకి మేలు చేస్తోందని. చెప్పిన ఆయన విధానాల్లో మంచి, చెడు ఉంటాయని ,. వాటిని అంశాలవారీగానే చూడాలి తప్ప వ్యక్తి ఆధారంగా వాటిని అంచనా వేయొద్దని అన్నారు.. ఇక మోడీ చేపట్టిన అనేక మంచి పనుల్లో ఉజ్జ్వల కార్యక్రమం ఒకటి అని సింఘ్వీ ట్వీట్‌ చేశారు. కాగా దీన్ని జైరాం రమేశ్‌ని ట్యాగ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+