వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మెరీనాబీచ్ వేదికగా దీప వర్సెస్ శశికళ, రెండు గ్రూపుల బలప్రదర్శన

మెరీనా బీచ్ వద్ద శశికళ, దీప మద్దతుదారులు బల ప్రదర్శనకు దిగారు. మెరీనాబీచ్ వద్ద ఉన్న ఎంజిఆర్ సమాధి వద్ద ఈ రెండు గ్రూపులు బలప్రదర్శనకు దిగారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

చెన్నై : తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి వేడెక్కాయి. ఎంజిఆర్ శతజయంతి వేడుకలను వేదికగా చేసుకొని అన్నాడిఎంకె ప్రధాన కార్యదర్శి శశికళ, జయ లలిత మేనకోడలు వర్గాలు బలప్రదర్శనకు దిగాయి.ఈ పరిస్థితులు రాజకీయవాతావారణాన్ని వేడెక్కించాయి.

జయలలిత మేనకోడలు రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నట్టు ప్రకటించారు. జయ మరణం తర్వాత దీపను రాజకీయాల్లోకి రావాలంటూ పలువురు ఆమెను కోరుతున్నారు. అన్నాడిఎంకె పార్టీ పగ్గాలను శశికళ చేపట్టడాన్ని వ్యతిరేకించేవారంతా దీపకు మద్దతు పలుకుతున్నారు.

shashikala and deepa followers rally at merina beach on tuesday.

ఎంజిఆర్ శత జయంతి వేడుకల సందర్భంగా రాజకీయ పార్టీ ఏర్పాటుపై ప్రకటన చేయనుంది దీప. ఈ మేరకు ఆమె అన్ని ఏర్పాట్లు చేసుకొంది. అన్నాడిఎంకెలో గతంలో కీలకంగా వ్యవహరించిన కొందరు నాయకులు దీపకు మద్దతుగా నిలిచేఅవకాశం ఉంది.

శశికళ పార్టీ పగ్గాలు చేపట్టడం ఇష్టం లేని నాయకులు కూడ ఈ మేరకు దీప వైపుకు వెళ్ళే అవకాశం ఉంది. ఎంజిఆర్ శతజయంతి వేడుకల సందర్భాన్ని పురస్కరించుకొని రాజకీయపార్టీ ఏర్పాటును దీప ప్రకటించనున్నారు.

అయితే ఈ సందర్భాన్ని పురస్కరించుకొని దీప, శశికళ మద్దతుదారులు ఇవాళ మెరీనాబీచ్ వద్ద బల ప్రదర్శనకు దిగారు. వీరిద్దరి మద్దతుదారులు మెరీనాబీచ్ వద్ద పోటాపోటీగా నినాదాలు చేశారు. రెండు వర్గాలమద్య పోటాపోటీగా బలప్రదర్శనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండు వర్గాలను పోలీసులు సముదాయించారు.

English summary
shashikala and deepa followers rally at merina beach on tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X