అన్నా డిఎంకె పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎన్నిక
అన్నాడిఎంకె పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ నటరాజన్ ఎన్నికయ్యారు. చెన్నైలో ని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఆమెను ఎన్నుకొన్నారు.
చెన్నై :అన్నాడిఎంకె పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ నటరాజన్ ఎన్నికయ్యారు. చెన్నైలో ని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఆమెను ఎన్నుకొన్నారు. ఆమెను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడం లాంఛనమే అయినట్టుగా అందరూ భావించినట్టుగానే ఆమెకే పార్టీ నాయకులు పట్టం కట్టారు.
శశికళ నటరాజన్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. జయలలితకు ఆమె సన్నిహితురాలుగా ఉంది. అమ్మ మరణం తర్వాత చిన్నమ్మనే పార్టీ పగ్గాలు స్వీకరించాలని పార్టీ నాయకులు ఆమెను కోరారు.ఆమెను పార్టీ నడిపించే సత్తా ఉందని పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఈ మేరకు పార్టీ అధికారిక వెబ్ సైట్ లో ఆమెనుప్రధాన కార్యదర్శిగా ఎన్నుకొన్నారని ప్రకటించింది.

పార్టీ సీనియర్ నాయకులు మధుసూదన్ నాయకత్వంలో అన్నా డిఎంకె నాయకులు సమావేశమై శశికకళకు పగ్గాలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకొన్నారు. తొలుత సమావేశమైన పార్టీ నాయకులు జయలలితకు నివాళులర్పించారు.
ఈ సమావేశంలో మరో 14 తీర్మాణాలు ఆమోదించారు. జయలలిత పుట్టిన రోజున జాతీయ రైతుల దినోత్సవంగా ప్రకటించాలని తీర్మాణం చేశారు.అమ్మకు భారత రత్న ఇవ్వాలని తీర్మాణాన్ని ఆమోదించారు.












Click it and Unblock the Notifications