'షీనాకు నా కొడుకుతో అఫైర్, అందుకే హత్య'

ముంబై: షీనా బోరా హత్య కేసులో దిగ్భ్రాంతికరమైన విషయాలు బయటపడుతున్నాయి. తన కుమారుడితో ఇంద్రాని కూతురు షీనా బోరాకు అపైర్ ఉందనే అనుమానాలున్నాయని టీవీ మొఘల్ పీటర్ ముఖార్జియా చెప్పారు. ఈ సంబంధాన్ని తన భార్య ఇంద్రానీ

అంగీకరించలేకపోయిందని ఆయన చెప్పారు. ఎన్టీటివీతో ఆయన ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

ఇంద్రానీని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. షీనా బోరా హత్య కేసులో పోలీసులు తన భార్య ఇంద్రానీ అరెస్టు చేయడం తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని ఆయన చెప్పారు. తనను ఇంత కాలం చీకట్లో ఉంచారని అర్థమైందని స్టార్ ఇండియా మాజీ సిఈవో పీటర్ చెప్పారు.

Sheena Bora Was Dating My Son, Says TV Mogul Peter Mukerjea

షీనా బోరా మొదటి భర్తతో ఇంద్రానీకి జన్మించింది. షీనాను చంపేసి ముంబైకి 80 కిలోమీటర్ల దూరంలో గల అటవీ ప్రాంతంలో పడేశారు. తమకు అందిన సమాచారంతో ఇటీవల ముఖార్జియా డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో విషయం బయటకు వచ్చింది.

హత్యకు కారణమేమిటనేది చెప్పలేదని పీటర్ ఎన్డీటీవితో అన్నారు. తన కుమారుడితో షీనా సంబంధం ఇంద్రానీకి ఏ మాత్రం ఇష్టం లేదని ఆయన చెప్పారు. ఆ సంబంధాన్ని తాను గానీ ఇంద్రానీ గానీ అంగీకరించలేదని చెప్పారు.

తన భార్య ఇంద్రానీ మంగళవారంనాడు అరెస్టయిన తర్వాతనే షీనా ఇంద్రానీ సోదరి కాదు, కూతురు అని తెలిసిందని ఆయన చెప్పారు. పుకార్లను తాను ఎప్పుడూ సీరియస్‌గా పట్టించుకోలేదని ఆయన చెప్పారు. 2012 నుంచి షీనా కనిపించడం లేదని, చదువు కోసం అమెరికా వెళ్లిందని

తనకు చెప్పారని, షీనాను మరిచిపోవాలని తాను తన కుమారుడికి చెప్పానని ఆయన వివరించారు.

పీటర్ ముఖార్జియా ఇంద్రానీని 2002లో పెళ్లి చేసుకున్నారు. ఆ సమయంలో ఆమె స్టార్ ఇండియా నెట్‌వర్క్ హెచ్‌ఆర్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+