నటి శిఖా మృతిలో కొత్త కోణం: డబ్బులడిగిందని డాక్టర్, ఫైట్ చేస్తానని కూతురు

ముంబై: బీఏ పాస్ ఫేం బాలీవుడ్ నటి శిఖా జోషి మృతి కేసులో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు కొనసాగుతున్నాయి. తాజాగా శిఖా ఆరోపణలు చేసిన కాస్మోటిక్ సర్జన్ ఆమె పైన ప్రతి ఆరోపణ చేసారు. తనను ఆమె డబ్బులు డిమాండ్ చేసిందని పోలీసుల విచారణలో వెల్లడించినట్లుగా తెలుస్తోంది.

గురువారం నాడు కాస్మోటిక్ సర్జన్ అయిన డాక్టర్ విజయ్ శర్మ స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డ్ చేశారు. శిఖా జోషి తన మరణానికి ముందు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో కాస్మోటిక్ సర్జన్, బాలీవుడ్‌లో పలువురు పెళ్లి కాని వారి పైన ఆరోపణలు చేసింది.

ఈ నేపథ్యంలో సదరు కాస్మోటిక్ సర్జన్‌ను వేర్సోవా పోలీసులు గురువారం విచారించారు. అతనిని దాదాపు మూడు గంటల పాటు విచారించారు.

ఆంగ్ల మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం... మోడల్ కమ్ నటి శిఖా జోషి సదరు కాస్మోటిక్ సర్జన్‌ను బెదిరించింది. తన వక్షోజాల రీప్లేస్ చికిత్స కోసం అయిన డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేసినట్లుగా తెలుస్తోంది. లేదంటే తాను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించిందని సమాచారం.

shikha joshi

2011లో ఆమెకు సర్జరీ జరిగింది. శిఖా, ఆమె సోదరుడు విశేష్ ఆ బిల్లు ఇవ్వాలని డిమాండ్ చేశారని, దీంతో తన ఇంటి పైన రాళ్లు విసిరారని చెప్పాడని తెలుస్తోంది. పైగా తన పైన వేధింపుల ఫిర్యాదు చేసిందని చెప్పాడు.

అయితే, ఈ మృతి కేసులో అన్ని కోణాల్లో విచారణ జరుపుతామని పోలీసు అధికారులు చెబుతున్నారు. పోలీసులు కాస్మోటిక్ సర్జన్‌తో పాటు మరో ఏడుగురి స్టేట్ మెంట్ రికార్డ్ చేశారు. అందులో శిఖా రూమ్మేట్ మధు కూడా ఉన్నారు.

సమాచారం మేరకు.. శిఖా జోషి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన అనంతరం దాదాపు గంట తర్వాత ఆమెను ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. ఆలస్యం పైన కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు.

శిఖా జోషి కూతురు శ్రావణి (19) మాట్లాడుతూ.. తన తల్లి పిరికి వ్యక్తి కాదని, ఆమె ఆత్మహత్యకు పాల్పడదని చెబుతున్నారు. నేను న్యాయం కోసం పోరాడుతానని చెప్పారు. మే 19వ తేదీన శిఖా జోషీ బాత్ రూంలో ఆత్మహత్యకు పాల్పడగా, రూమ్మెట్ ఆమె సూసైడ్ స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారు. అందులో పలువురి పేర్లను శిఖా ప్రస్తావించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+