Raj Kundra Arrest : శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాలో మరో కోణం-పోర్న్ చిత్రాలు-పక్కా ఆధారాలతో అరెస్ట్
ప్రముఖ సినీ నటి శిల్పా శెట్టి భర్త,వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను ముంబై పోలీసులు సోమవారం(జులై 19) రాత్రి అరెస్ట్ చేశారు. పోర్న్ చిత్రాలు నిర్మిస్తున్నారన్న ఆరోపణలతో పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేయడం గమనార్హం. రాజ్‌కుంద్రాపై ఆరోపణలకు సంబంధించి తమ వద్ద అన్ని ఆరోపణలు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
పోర్న్ చిత్రాల నిర్మాణానికి సంబంధించి ఈ ఏడాది ఫిబ్రవరిలోనే నమోదైనట్లు పోలీసులు తెలిపారు. ఇందులో రాజ్ కుంద్రా పాత్ర కీలకంగా ఉందని నిర్దారించామన్నారు. 'ముంబై క్రైమ్ బ్రాంచ్‌లో ఫిబ్రవరి,2021లో పోర్న్ చిత్రాలకు సంబంధించి కేసు నమోదైంది. పోర్న్ చిత్రాల నిర్మాణం,పలు యాప్స్‌లో వాటిని అప్‌లోడ్ చేసిన కారణంగా ఈ కేసు నమోదు చేశాం. ఇందులో రాజ్‌కుంద్రా ప్రధాన సూత్రధారిగా ఉన్నట్లు తెలుస్తోంది.దీనికి సంబంధించి అన్ని ఆధారాలు మా వద్ద ఉన్నాయి. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.' అని ముంబై పోలీస్ కమిషనర్ వెల్లడించారు.

మరోవైపు రాజ్ కుంద్రా తనపై వస్తున్న ఆరోపణలను ఖండిస్తున్నట్లు తెలుస్తోంది. పోర్న్ చిత్రాలు నిర్మించినట్లుగా చెబుతున్న సంస్థతో తాను గతంలోనే తెగదెంపులు చేసుకున్నానని ఆయన చెబుతున్నట్లు సమాచారం.
గతంలో ఐపీఎల్‌లో రాజస్తాన్ రాయల్స్ జట్టుకు రాజ్‌కుంద్రా సహ యజమానిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్-2013 సీజన్‌లో బయటపడ్డ మ్యాచ్ ఫిక్సింగ్‌లో రాజ్ కుంద్రాపై కూడా ఆరోపణలు వచ్చాయి. దీంతో ఐపీఎల్‌లో పాల్గొనకుండా ఆయనపై నిషేధం కూడా పడింది. 2018లో బిట్‌కాయిన్ కుంభకోణంలోనూ రాజ్ కుంద్రాపై ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో ఈడీ ఆయన్ను విచారించింది. తాజాగా పోర్న్ చిత్రాల కేసులో ఇరుక్కోవడంతో రాజ్ కుంద్రా పరువు పోయినట్లయింది.
ఇదే కేసుకు సంబంధించి ఈ ఏడాది ఫిబ్రవరి 7న బాలీవుడ్ నటి గెహానా వశిష్ఠను పోలీసులు అరెస్ట్ చేశారు.పోర్న్ వీడియోలను చిత్రీకరిస్తూ,వాటిని వెబ్ ప్లాట్‌ఫామ్స్‌లో అప్‌లోడ్ చేస్తోందన్న ఆరోపణల మేరకు పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. గెహానాతో పాటు మొత్తం ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.ఈ వ్యవహారంలో కీలక సూత్రధారిగా రోయా ఖాన్ అలియాస్ యాస్మీన్‌ను గుర్తించారు. ముంబై కేంద్రంగా ఓ గ్యాంగ్ పోర్న్ బిజినెస్ నిర్వహిస్తున్నట్లు స్థానిక క్రైమ్ బ్రాంచ్ పోలీసుల దృష్టికి రావడంతో పోలీసులు దీన్ని చేధించే పనిలో నిమగ్నమయ్యారు.
-
Kangana Ranaut:మంగ్లీ పాటపై మండిపడ్డ ఎంపీ కంగనా-హద్దులు దాటేశారంటూ..!! -
రూ. 2 వేల కోట్ల బొమ్మ.. "ధురంధర్ - ది రివెంజ్" రివ్యూ.. ఇది సార్ సినిమా అంటే !! -
ధురంధర్-2 పై RGV రివ్యూ.. షోలే కంటే 100 రెట్లు గొప్పగా.. స్పీల్ బర్గ్, నోలన్ సైతం.. -
ధురంధర్ 2 ట్విట్టర్ రివ్యూ: మాస్టర్ పీస్.. ఎపిక్ బ్లాక్ బస్టర్ -
రెండు ఎలక్ట్రిక్ స్టవ్ లు కొన్నా.. గ్యాస్ కొరత వేళ సూపర్ స్టార్ సంచలనం -
ఇక ఒక్క మిస్డ్ కాల్‌తో గ్యాస్ బుకింగ్: కొత్త నంబర్లు ఇవే! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు?












Click it and Unblock the Notifications