మోడీ దిష్టిబొమ్మ దహనం: మంటల్లో కాంగ్రెస్ కార్యకర్తలు
న్యూఢిల్లీ: గాంధీ కుటుంబంపై ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని ఎన్టీఏ ప్రభుత్వం కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతుందని సిమ్లా కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి నిరసనగా ప్రధాని మోడీ దిష్టిబొమ్మను కాంగ్రెస్ కార్యకర్తలు దహనం చేశారు.

ఈ క్రమంలో మోడీ దిష్టిబొమ్మపై కిరోసిన్ పోశారు. ఇంతలో ఒక కార్యకర్త సిగరెట్ లైటర్‌తో దిష్టిబొమ్మను వెలిగించాడు. ఒక్కసారిగా ఉవ్వెత్తున ఎగిసిన మంటలు దిష్టిబొమ్మ చుట్టూ ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలకు సైతం అంటుకున్నాయి.
ఈ ఘటనలో ఐదుగురు కాంగ్రెస్ కార్యకర్తలకు మంటలు వ్యాపించాయి. గాయపడిన కార్యకర్తలను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో క్షతగాత్రులు ఇందిరా గాంధీ మెడికల్ కళాశాలలో చేర్పించారు.












Click it and Unblock the Notifications