న్యాయ సలహా కోరుతాం: తెలంగాణ బిల్లుపై షిండే

రాష్ట్ర అసెంబ్లీనుంచి తిరిగి వచ్చిన తెలంగాణ బిల్లుపై న్యాయ సలహా కోరతామని సుశీల్‌కుమార్ షిండే తెలిపారు. గురువారం రాత్రి తనను కలిసిన కొంతమంది మీడియా ప్రతినిధులతో ఆయన పిచ్చాపాటిగా మాట్లాడారు.
తెలంగాణ బిల్లును తిరస్కరిస్తూ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసిన నేపథ్యంలో తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతోంది అని ప్రశ్నించగా.. తెలంగాణ బిల్లుపై నిర్ణయం తీసుకోవడానికి తమకు కొంత సమయం కావాలని ఆయన అన్నారు. బిల్లుకు వ్యతిరేకంగా రాష్ట్ర అసెంబ్లీ చేసిన తీర్మానంపై అటార్నీ జనరల్ సలహా తీసుకుంటామని షిండే తెలిపారు.
అటార్నీ జనరల్ ఇచ్చే సలహా చాలా ముఖ్యమైనదని ఆయన చెప్పారు. వచ్చే నెల 4వతేదీన జరిగే మంత్రుల బృందం(జీవోఎం) సమావేశంలో అన్ని విషయాలు చర్చిస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications