Assembly Poll Survey: బెంగాల్, అస్సాంలో గెలుపెవరిది ? షైనింగ్ ఇండియా తాజా సర్వే..!

ఈ నెలలో జరిగే పశ్చిమబెంగాల్ (west Bengal), అస్సాం (assam) అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా పశ్చిమబెంగాల్లో మరోసారి మమతా బెనర్జీ గెలుస్తారా లేక బీజేపీకి అవకాశం ఉంటుందా అన్న చర్చ దేశవ్యాప్తంగా సాగుతోంది. ఓటర్ల జాబితా సవరణ తర్వాత బీహార్ లో వెలువడిన ఫలితాల ప్రభావం బెంగాల్లోనూ కొనసాగితే ఫలితాల్లో తేడా ఉండొచ్చని తెలుస్తోంది. అలాగే అస్సాంలో అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి హిమంత బిశ్వశర్మ హవా కొనసాగుతుందా లేదా అన్న ఉత్కంఠ కూడా నెలకొంది.

ఈ నేపథ్యంలో షైనింగ్ ఇండియా అనే సంస్థ నిర్వహించిన తాజా సర్వేలో (survey) పశ్చిమబెంగాల్లో ఓటర్లు తమ అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పేశారు. ఈ సర్వే ప్రకారం అధికార తృణమూల్ కాంగ్రెస్ అత్యధికంగా 42.1 శాతం ఓట్లు సాధించి ముందంజలో ఉన్నట్లు స్పష్టమైంది. బీజేపీ 37.3 శాతం ఓట్లతో రెండో స్ధానంలో నిలిచింది. లెఫ్ట్ 9.1 శాతం, కాంగ్రెస్ 3.6 శాతం, ఇతరులు 2.1 శాతం ఓట్లు సాధిస్తున్నట్లు సర్వేలో తేల్చారు.

Shining india Survey predictions on west Bengal and assam assembly polls-who is on edge

అలాగే అస్సాంలో నిర్వహించిన సర్వేలో బీజేపీ 42.4 శాతం ఓట్లతో ముందంజలో ఉంది. కాంగ్రెస్ 38.6 శాతం ఓట్లు సాధించి రెండో స్ధానంలో నిలవబోతున్నట్లు తేలింది. యూడీఎఫ్ కు 3.7 శాతం ఓట్లు, ఇతరులకు 9.5 శాతం ఓట్లు లభించాయి. ఈ లెక్కన బీజేపీకి 76 సీట్లు లభించబోతున్నాయని, రెండో స్ధానంలో ఉన్న కాంగ్రెస్ కు 40 సీట్లు వస్తాయని తేలింది. యూడీఎఫ్ కు నాలుగు సీట్లు వస్తాయని అంచనా వేశారు. ఇతరులకు 6 సీట్లు దగ్గబోతున్నాయి. రాష్ట్రంలో 21 సీట్లలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటాపోటీ వాతావరణం ఉన్నట్లు షైనింగ్ ఇండియా సర్వేలో తేలింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+