తెగబడిన 30 మంది దోపిడీ దొంగలు: రైలులో స్వైర విహారం
బాలాపూర్: మహారాష్ట్రలో ఓ రైలులో దోపిడీ దొంగలు స్వైర విహారం చేశారు. షిరిడీ - మైసూరు రైలులో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. దాదాపు మంది దొంగలు మంగళవారం అర్థరాత్రి 12 గంటల ప్రాంతంలో భారీ దోపిడీకి పాల్పడ్డారు.
రైల్లోకి ప్రవేశించిన దాదాపు 30 మంది దోపిడీ దొంగలు ఎస్ 1 బోగీ నుంచి ఎస్ 14 బోగీల వరకు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ప్రయాణికులను బెదిరించి భారీగా బంగారం, నగదు దోచుకున్నారు. మహరాష్ట్రలోని బాలాపూర్ వద్ద ఈ సంఘటన జరిగింది.

బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దోపిడీ దొంగలను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications