షిర్డీ సాయి భక్తులకు గుడ్‌న్యూస్: బంద్ ఉపసహరించుకున్న స్థానికులు
మన్మడ్: షిర్డీ సాయి బాబా భక్తులకు శుభవార్త. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(CISF) భద్రతపై స్థానికులు, వ్యాపారుల షిర్డీ బంద్ పిలుపుతో మహారాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చింది. స్థానిక ప్రతినిధుల డిమాండ్లకు ఒప్పుకుంది. షిర్డీ ఆలయంలో సీఐఎస్ఎఫ్ భద్రత పెట్టకుండా ప్రభుత్వం తరపున హైకోర్టులో పోరాడుతామని మహారాష్ట్ర మంత్రి రాధాకృష్ణ వీకే పాటిల్ ప్రభుత్వం తరపున వారికి హామీ ఇచ్చారు. దీంతో మరికొన్ని స్థానికుల డిమాండ్లకు పరిష్కారం చూపిస్తామన్నారు.
ఈ క్రమంలో మే 1న తలపెట్టిన బంద్‌ను ఉపసంహరించుకున్నట్లు స్థానిక ప్రతినిధులు ప్రకటించారు. దీంతో భక్తులకు ఉపశమనం కలిగినట్లయింది. కాగా, ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉన్న కారణంగా షిర్డీలోని సాయి మందిరానికి భద్రత రెట్టింపు చేశారు. ప్రస్తుతం సాయిబాబా ఆలయ భద్రతా ఏర్పాట్లను సాయి సంస్థాన్ సిబ్బంది నిర్వహిస్తోంది.

ఆలయ ప్రాంగణం భద్రతను మహారాష్ట్ర పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. ఇందులో భాగంగా ఆలయాన్ని ప్రతిరోజు బాంబు స్క్వాడ్ తనిఖీ చేస్తుంది. అయితే, ఈ భద్రతా వ్యవస్థకు బదులు.. సీఐఎస్ఎఫ్ భద్రత కల్పించాలన్న నిర్ణయం తీసుకోవడంతో స్థానిక సంస్థల, వ్యాపారులు, ప్రతినిధుల ఆందోళన మొదలైంది.
కొన్ని సంవత్సరాల క్రితం, సంజయ్ కాలే అనే కార్యకర్త బాంబే హైకోర్టులోని ఔరంగాబాద్ బెంచ్‌లో ప్రతిరోజు దేశవ్యాప్తంగా వేలాది మంది భక్తులు సందర్శించే ఈ ఆలయానికి భద్రత కోసం కేంద్ర భద్రతా దళాన్ని నియమించాలని కోరుతూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. ఆలయ ప్రాంతంలో శాంతిభద్రతల పరిస్థితిపై నివేదిక సమర్పించాలని ప్రిన్సిపల్ జిల్లా న్యాయమూర్తిని ఆదేశించింది. సీఐఎస్ఎఫ్ భద్రతకు సాయి సంస్థాన్ కూడా అంగీకరించింది.

అయితే, స్థానికులు మాత్రం సీఐఎస్ఎఫ్ భద్రతను వ్యతిరేకించి ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చర్చలు జరిపి వారు పిలిపునిచ్చిన బంద్‌ను విరమింపజేసింది. షిర్డీ నివాసితుల వైఖరికి మద్దతుగా రాష్ట్ర ప్రభుత్వం బాంబే హైకోర్టులో జోక్యం చేసుకునే దరఖాస్తును దాఖలు చేస్తుందని అహ్మద్‌నగర్ సంరక్షక మంత్రి, రాష్ట్ర రెవెన్యూ మంత్రి రాధాకృష్ణ విఖే పాటిల్ నివాసితుల ప్రతినిధి బృందానికి హామీ ఇవ్వడంతో బంద్ పిలుపు ఉపసంహరించుకున్నారు.
మా వైఖరికి మద్దతుగా రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్వెన్షన్ అప్లికేషన్‌ను దాఖలు చేస్తుందని సంరక్షక మంత్రి రాధికృష్ణ విఖే పాటిల్ హామీ ఇవ్వడంతో.. మేము బంద్ పిలుపుని ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్నాము అని షిర్డీ సాయి సంస్థాన్ మాజీ ధర్మకర్త చెప్పారు. కాగా, బోర్డు ట్రస్టీలలో 50% మంది షిర్డీ పట్టణానికి చెందిన వారు ఉండాలని ప్రభుత్వం నిబంధన పెట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications