కాంగ్రెస్, సేన వెనక్కి, మహారాష్ట్ర స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో బీజేపీ, శివసేన మధ్య దూరం మరింత పెరుగుతున్నట్లే కనపిస్తోంది. రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్షంలోనే కూర్చుంటామని సోమవారం ప్రకటించిన శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే మంగళవారం నాడు అసెంబ్లీ స్పీకర్ పదవికి కూడా నామినేషన్ దాఖలు చేసింది.
శివసేన తరుపున విజయ్ అవ్తీ నామినేషన్ దాఖలు చేశారు. భారతీయ జనతా పార్టీ నుంచి హరిభావ్ బాగ్డే, కాంగ్రెస్ నుంచి వర్షా గైక్వాడ్ నామినేషన్లు వేశారు. ఇక స్పీకర్ పదవికి తాము పోటీ చేయబోమని ఎన్‌సీపీ ప్రకటించిన విషయం తెలిసిందే.

దీంతో మాహారాష్ట్ర స్పీకర్ పదవికి ముక్కోణపు పోటీ నెలకొంది. రాష్ట్ర చరిత్రలో ఇలాంటి పరిస్ధితి నెలకొనడం ఇదే మొదటిసారని అసెంబ్లీ ప్రిన్సిపల్ కార్యదర్శి అనంత్ కల్సే చెప్పారు. బుధవారం ఉదయం 11 గంటలకు రహస్య బ్యాలెట్ ద్వారా స్పీకర్ పదవికి ఎన్నిక నిర్వహిస్తారు.
ఇది ఇలా ఉంటే, పార్టీ ఎమ్మెల్యేలతో శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే మంగళవారం భేటీ అయ్యారు. బుధవారం ఉదయం 9 గంటలకల్లా ఎమ్మెల్యేలందరూ సభ హాజరు కావాలని ఆదేశించినట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే మహారాష్ట్ర శాసనసభాపతి ఎన్నిక ఏకగ్రీవమయ్యేందుకు సహకరించాలని... మరోవైపు, పోటీ నుంచి తప్పుకోవాలని కాంగ్రెస్, శివసేనలను ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కోరారు.
దీంతో శివసేన, కాంగ్రెస్ పార్టీ పార్టీల అభ్యర్ధులు తమ నామినేషన్లను వెనక్కి తీసుకున్నారు. దీంతో మహారాష్ట్ర శాసనసభాపతి ఎన్నిక ఏకగ్రీవమైంది. మహారాష్ట్ర శాసనసభపతిగా భారతీయ జనతా పార్టీకి చెందిన హరిభావ్ బాగ్డేను ఎన్నుకున్నారు.












Click it and Unblock the Notifications