వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేప్ ఆరోపణలు ఇప్పుడు ఫ్యాషన్: శివసేన,డిఐజికి సపోర్ట్

|
Google Oneindia TeluguNews

Shiv Sena says slapping rape charges is now a 'fashion'
ముంబై: అత్యాచారం ఆరోపణలపై శివసేన వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. అత్యాచారం కేసులు పెట్టడం ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయిందని మండిపడింది. అంతేగాక ఇటీవల ఓ మోడల్‌పై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపిఎస్ అధికారి, డిఐజి సునీల్ పరాస్కర్‌కు శివసేన మద్దతుగా నిలిచింది. ఉన్నతాధికారులపై రేప్ కేసులు పెట్టడం ఫ్యాషన్‌గా మారిందని పేర్కొంది.

ఉన్నత వర్గాలకు చెందిన వారిపై లైంగిక వేధింపులు, అత్యాచారం ఆరోపణలు చేయడం ఇప్పుడు బాగా పెరిగిపోయిందని, ఇదొక పెద్ద ఫ్యాషన్‌లా మారిపోయిందని శివసేన పార్టీ పత్రిక ‘సామ్నా'లో పేర్కొంది. ఎన్నో ఏళ్లుగా పోలీసు విభాగంలో సేవలందిస్తున్న సునీల్ పరాస్కర్.. ఒక్క అత్యాచారం ఆరోపణతో రాత్రికి రాత్రికి విలన్ అయిపోయారని తెలిపింది. ఈ ఆరోపణలన్నీ వ్యక్తిగత పగను తీర్చుకునేందుకు ఆయుధాలుగా మారుతున్నాయని అభివర్ణించింది.

అత్యంత దారుణమైన నిర్భయ ఘటన తర్వాత అనేకమైన చట్టాలు వచ్చాయన్న శివసేన.. అవేమైనా అత్యాచారాలను తగ్గించగలిగాయా? అని ప్రశ్నించింది. నిజం బయటికి వచ్చినప్పుడే అది తెలుస్తుందని తెలిపింది. మీడియా వీటిపై అతిగా స్పందించి ఆ అధికారికి ఉన్న ప్రతిష్ఠను దిగజారుస్తున్నాయని పేర్కొంది. ‘దేశంలోని అన్ని చట్టాలు మహిళలకు అనుకూలంగా ఉన్నాయి. ఎవరైనా ఎవరిపైనైనా అభియోగాలు చేయవచ్చు. న్యాయస్థానాలు కళ్లు తెరిచి అమాయకులను శిక్షించకుండా చూడాలి'అని పేర్కొంది.

డిఐజిపై అత్యాచార ఆరోపణలు చేసిన మోడల్‌పై శివసేన మండిపడింది. ఇప్పటి వరకు అన్ని సరిగ్గా జరగడంతోనే అతనిపై ఎలాంటి ఆరోపణలు చేయలేదా అని ప్రశ్నించింది. ఎప్పుడో అత్యాచారం చేశాడని ఇప్పుడు ఆరోపణలు చేయడమేంటని ఎవరూ ప్రశ్నించరా? అని పేర్కొంది. పోలీస్ విచారణ ఈ కోణంలోనూ జరగాలని తెలిపింది. ఆ మోడల్ ఎప్పుడో జరిగిన ఘటనపై ఇప్పుడెందుకు కేసు పెడుతోంది.. ఇంతకాలం ఎందుకు వేచిచూడాల్సి వచ్చిందని శివసేన ప్రశ్నించింది.

‘ఆరు నెలల క్రితం జరిగిన ఘటనపై ఆ మోడల్ ఇప్పుడు ఆరోపణలు చేస్తోంది. శక్తిమిల్స్‌లో జరిగిన అత్యాచార ఘటనపై బాధితురాలు గంటల వ్యవధిలోనే ఫిర్యాదు చేసింది. ఏ మహిళైనా తనపై జరిగిన ఈ దారుణాన్ని ఒక నిమిషం కూడా దాచిపెట్టదు. ఆమె వెంటనే దానిపై ఫిర్యాదు చేస్తుంది' అని శివసేన తన కథనంలో పేర్కొంది. కానీ డిఐజిపై కేసు విషయంలో అలా జరగలేదని తెలిపింది. నిజాలు త్వరలోనే బయటపడతాయని పేర్కొంది.

English summary
The Shiv Sena on Saturday came out in support of senior IPS officer Sunil Paraskar, accused of raping a city-based model, and made light of the allegations against him saying it has become a "fashion" to charge men with rape.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X