బీహార్‌లో ఓడిన బిజెపిపై శివసేన ఘాటు వ్యాఖ్యలు
ముంబై: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెంది చితకలపడిన బీజేపీకి మిత్రపక్షం అయిన శివసేన తనదైన శైలిలో విమర్శలు చేసింది. బీహార్ లో బీజేపీని గొయ్యిలో పాతిపెట్టారని, అది బయటకు రావడానికి చాల కాలం పడుతుందని విమర్శించింది.
శివసేనకు చెందిన సామ్నా సంపాదకీయంలో నితీశ్ కుమార్ ను ప్రశంసలతో ముంచెత్తింది. అదే విధంగా బీజేపీ మీద తీవ్రస్థాయిలో మండిపడింది. బీజేపీ అన్ని విషయాలను చాల తేలికగా తీసుకుని చివరికి చితకలపడుతుందని ఎద్దేవ చేసింది.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను తేలికగా తీసుకున్న బీజేపీ చివరికి షాక్ గురైయ్యిందని గుర్తు చేశారు. బీహార్ ఎన్నికలను సీరియస్ గా తీసుకున్నా ఫలితం మాత్రం శూన్యం అని గుర్తు చేసింది. నరేంద్ర మోడీ వర్సెస్ నితీశ్ కుమార్ కు ముఖాముఖి పోరు జరిగిందని అంటున్నది.

డబ్బు, రాజకీయ వ్యూహాలు, భారీ ప్యాకేజీల ప్రకటనలు చేసినా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ మిత్ర పక్షాలకు 60 సీట్లు మించలేదని, బీహార్ ప్రజలు తగిన నిర్ణయం తీసుకున్నారని గుర్తు చేసింది. నిరాడంబర ప్రచారం, నిజాయితీ ఇమేజ్ తో నితీశ్ తన అధికారాన్ని నిలబెట్టుకున్నారని అభిప్రాయం వ్యక్తం చేసింది.
అనాగరిక బాష, బూటకపు హామీలు బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పని చెయ్యలేదని చెప్పింది. బీహార్ లో మహాకూటమి గెలిస్తే పాకిస్థాన్ లో టపాసులు పేలాయే, లేదో మాకు తెలియదని శివసేన వ్యాఖ్యానించింది. మొత్తం మీద మిత్రపక్షమైన బీజేపీకి శివసేన గట్టి షాక్ ఇచ్చింది.












Click it and Unblock the Notifications