ముస్లింలు, క్రిస్టియన్లకు ఫ్యామిలీ ప్లానింగ్ తప్పనిసరి: శివసేన

ముంబై: శివసేన మరోసారి వివాదాస్పద వ్యఖ్యలు చేసింది. ఇటీవలే ముస్లింలకు ఓటు హక్కును రద్దు చేయాలని డిమాండ్ చేసిన శివసేన.. ఇప్పుడు ముస్లింలు, క్రిస్టియన్లు కుటుంబ నియంత్రణ చేసుకోవాలని, వారికి ఇది తప్పనిసరని పేర్కొంది. పెరుగుతున్న వారి జనాభాను దృష్టిలో ఉంచుకొని కుటుంబ నియంత్రణ చేపట్టాలని సూచించింది.

‘ఒకరు జనాభాను పెంచి దేశాన్ని పాకిస్థాన్‌‌గా మార్చగలుగుతారు కావచ్చు గానీ, వారి కుటుంబసభ్యులకు నాణ్యమైన, ఆరోగ్యమైన జీవితాన్ని ఇవ్వలేరు' అని శివసేన తన అధికారిక పత్రిక సామ్నాలో పేర్కొంది. ఆల్ ఇండియా హిందూ మహాసభ సాధ్వి దేవ ఠాకూర్‌కు మద్దతు పలికిన శివసేన, ఆమె చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టింది.

Shiv Sena wants mandatory family planning for Muslims, Christians

సాధ్వీ దేవా ఇటీవల మాట్లాడుతూ.. ‘ముస్లింలు, క్రిస్టియన్ల జనాభా పెరగడం దేశానికి ప్రమాదకరం. అందుకే వారికి బలవంతంగా సంతాన శక్తి లేకుండా చేయాలి' అని అన్నారు. అయితే కుటుంబ నియంత్రణకు బదులు సంతాన శక్తి లేకుండా చేయాలన్నారని సామ్నా కథనం పేర్కొంది. విపరీతంగా పెరుగుతున్న ముస్లిం, క్రిస్టియన్ల జనాభాను కేంద్రం ఎమర్జెన్సీ విధించి వారికి సంతాన శక్తి లేకుండా చేయాలని ఠాకూర్ డిమాండ్ చేశారు. దీని ద్వారా వారి జనాభాను నియంత్రించవచ్చని అన్నారు.

తమ మతం పట్ల చిత్తశుద్ధి ఉన్నట్లయితే ఏఐఎంఐఎం నాయకుడు అసదుద్దీన్ ఓవైసీ.. ముస్లింలు కుటుంబ నియంత్రణ చేసుకునేలా చూడాలని శివసేన డిమాండ్ చేసింది. అంతేగాక, ముస్లిం మహిళలు బురఖా ధరించే సంప్రదాయాన్ని ఎత్తేసేందుకు మద్దతు తెలపాలని సూచించింది.

కుటుంబ నియంత్రణ వల్ల తమ కుటుంబసభ్యులకు నాణ్యమైన విద్యతోపాటు జీవితాన్ని అందించే అవకాశం ఉంటుందని శివసేన పేర్కొంది. ముస్లింలు సంతోషకరమైన జీవితాలు గడపాలనేది తమ ఉద్దేశమని, అందుకే కుటుంబ నియంత్రణ చేసుకోవాలని సూచిస్తున్నట్లు శివసేన తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+