శివసేన కథ ఆరు నెలల్లో క్లోజ్, మేము చేసిన పెద్ద తప్పు అదే, బీజేపీదే హవా, కేంద్ర మంత్రి ఫైర్!

న్యూఢిల్లీ/బెంగళూరు: శివసేనతో కలిసి మహారాష్ట్ర శాసన సభ ఎన్నికల్లో పోటీ చేసి చాల పెద్ద తప్పు చేశామని కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత సదానంద గౌడ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఆరు నెలల్లో శివసేన అడ్రస్ లేకుండా పోతుందని, అలాంటి పార్టీ ఒకటుండేది అని మహారాష్ట్ర ప్రజలు త్వరలోనే చెప్పుకుంటారని కేంద్ర మంత్రి సదానంద గౌడ అన్నారు. మహారాష్ట్ర శాసన సభ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేసి ఉంటే ఇప్పటికంటే ఇంకా ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉండేదని, కచ్చితంగా ఇప్పటికి బీజేపీ సొంత బలంతో అధికారంలో ఉండేదని కేంద్ర మంత్రి సదానంద గౌడ సంచలన వ్యాఖ్యలు చేశారు.

శివసేనకు నీతి లేదు

శివసేనకు నీతి లేదు

మహారాష్ట్రలో శాసన సభ ఎన్నికలకు ముందు బీజేపీతో పొత్తు పెట్టుకుని శివసేన ఎన్నికల్లో పోటీ చేసిందని కేంద్ర మంత్రి సదానంద గౌడ గుర్తు చేశారు. అయితే ఎన్నికల ముందు బీజేపీతో పొత్తు పెట్టుకున్న శివసేన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత బీజేపీకి ఎదురు తిరిగిందని, శివసేనకు కొంచెం కూడా నీతి లేదని కేంద్ర మంత్రి సదానంద గౌడ విమర్శించారు.

శివసేనకు అధికార దాహం

శివసేనకు అధికార దాహం

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 106 స్థానాల్లో విజయం సాధించిందని, శివసేన కేవలం 56 స్థానాల్లో విజయం సాధించిందని కేంద్ర మంత్రి సదానంద గౌడ గుర్తు చేశారు. శివసేన కంటే రెండింతల ఎక్కువ సంఖ్యలో ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీతో గొడవ పెట్టుకున్న శివసేన చాల పెద్ద తప్పు చేసిందని, న్యాయంగా మేమే (బీజేపీ) అధికారంలోకి రావడానికి శివసేన సహకరించి ఉండాలని కేంద్ర మంత్రి సదానంద గౌడ అభిప్రాయం వ్యక్తం చేశారు.

శివసేన కథ క్లోజ్

శివసేన కథ క్లోజ్

మహారాష్ట్రలో శివసేన పని అయిపోయిందని కేంద్ర మంత్రి సదానంద గౌడ అన్నారు. వచ్చే ఆరు నెలల్లో శివసేన పార్టీ గల్లంతు అవుతోందని, అలాంటి పార్టీ గతంలో ఉండేది అని మహారాష్ట్ర ప్రజలు చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని కేంద్ర మంత్రి సదానంద గౌడ సంచలన వ్యాఖ్యలు చేశారు. మొత్తం మీద శివసేన పార్టీ గల్లంతు అవుతోందని కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు చెయ్యడం వెనుక చాల పెద్ద కథే ఉంటోందని బీజేపీ కార్యకర్తలు అంటున్నారు.

మా సత్తా చూపిస్తాం

మా సత్తా చూపిస్తాం

కర్ణాటకలో కాంగ్రెస్- జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వ తీరుపై విసుగు చెందిన రెబల్ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారని, అందుకే ఇప్పుడు ఉప ఎన్నికలు జరుగుతున్నాయని కేంద్ర మంత్రి సదానంద గౌడ అన్నారు. రాజీనామా చేసిన అనర్హత ఎమ్మెల్యేలు ఉప ఎన్నికల్లో మళ్లీ ప్రజల ముందుకు వచ్చారని, కచ్చితంగా వారందరూ విజయం సాధించి మళ్లీ ఎమ్మెల్యేలు అవుతారని కేంద్ర మంత్రి సదానంద గౌడ జోస్యం చెప్పారు. ఉప ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో బీజేపీ అభ్యర్థులు విజయం సాధిస్తారని, కర్ణాటకలో బీజేపీ పూర్తి కాలం అధికారంలో ఉంటోందని కేంద్ర మంత్రి సదానంద గౌడ ధీమా వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+