చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శివాజీ కంటే ప్రభుత్వం గొప్పదేం కాదు: కమల్‌ హాసన్‌ ఆగ్రహం

మెరీనా తీరంలోని నటుడు శివాజీ గణేశన్‌ విగ్రహం తొలగింపుపై సినీ ప్రముఖుల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. తాజాగా నటుడు కమల్ హాసన్ కూడా ఈ చర్యను ఆక్షేపించారు. ‘శివాజీ కంటే ప్రభుత్వం గొప్పదేం కాదు..’ అని ఆయన ట

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

చెన్నై: మెరీనా తీరంలోని నటుడు శివాజీ గణేశన్‌ విగ్రహాన్ని గురువారం తొలగించిన సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా దీనిపై కమల్‌ హాసన్‌ స్పందించారు.

'శివాజీ తమిళుల హృదయాల్లో చెరిగిపోని స్థానాన్ని సంపాదించుకున్నారు. మనం ఆయన కోసం మరో విగ్రహం ఏర్పాటుచేసి దాన్ని జీవితాంతం కాపాడుకుందాం. తండ్రిలాంటివారైన శివాజీ కంటే ప్రభుత్వం గొప్పదేం కాదు' అని ట్వీట్‌ చేశారు.

kamal-hassan

గురువారం తెల్లవారుజామున శివాజీ గణేశన్‌ విగ్రహాన్ని మెరీనా బీచ్‌ నుంచి తొలగించి అడయారులోని స్మారక మండపానికి తరలించారు. ప్రధాన కూడలిలో దీన్నిఏర్పాటు చేయడం వల్ల ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోందనేది వాదన.

అక్కడి నుంచి శివాజీ విగ్రహాన్ని మార్చాలంటూ గాంధేయవాది శ్రీనివాసన్‌ మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ కేసులో చివరికి శివాజీ విగ్రహాన్ని తొలగించాలని కోర్టు తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలో గురువారం విగ్రహాన్ని తొలగించగా.. ఈ చర్యపై పలు వర్గాల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.

English summary
The veteran actor who is known for his candid tweets, said that Shivaji was an inspiration for the regular movie buff and the aspiring actor as well. He further addressed the thespian as his dad and placed him above the government. Kamal Haasan has worked with the late actor in the iconic movie Thevar Magan which fetched the latter a national award. According to media reports, Shivaji’s statue was moved in the wee hours of Thursday by the Public Works Department to the memorial built on Durgabai Deshmukh Road in Adayar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X