శివసేన కార్యవర్గ భేటీలో కీలక నిర్ణయాలు-రెబెల్స్ కు నోటీసులు-బాలాసాహెబ్ పేరు వాడకుండా..
మహారాష్ట్రలో శివసేనలో చోటు చేసుకున్న తిరుగుబాటు నేపథ్యంలో ఇవాళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా ముంబైలో జరిగిన జాతీయ కార్యవర్ఘ భేటీలో సీఎం ఉద్ధవ్ థాక్రే పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అదే సమయంలో గౌహతిలో రెబెల్ క్యాంప్ కూడా మీటింగ్ పెట్టుకుని తదుపరి కార్యాచరణపై దృష్టిసారించింది.
ముంబైలో జరిగిన శివసేన జాతీయ కార్యవర్గ భేటీలో శివసేన ఛీఫ్ ఉద్ధవ్ థాక్రే వర్చువల్ గా పాల్గొన్నారు. కరోనాతో బాధపడుతున్న ఆయన వర్చువల్ గానే మీటింగ్ కు హాజరయ్యారు. ఈ భేటీలో రెబెల్ ఎమ్మెల్యేలలో 16 మందికి అనర్హత వేటు వేస్తూ నోటీసులు ఇవ్వాలని నిర్ణయించారు. రెబెల్ క్యాంపులో దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నా కేవలం 16 మందికే ఈ నోటీసులు ఇవ్వబోతున్నారు. దీంతో ఈ పరిణామం ఉత్కంఠ రేపుతోంది.

మరోవైపు జాతీయ కార్యవర్గ భేటీలో బాలాసాహెబ్ పేరును ఇతరులు వాడకుండా శివసేన నేతలు ఓ తీర్మానం చేశారు. రెబెల్ క్యాంపుకు నేతృత్వం వహిస్తున్న ఏక్ నాథ్ షిండే శివసేన(బాలాసాబెబ్) పేరుతో కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు సంకేతాలు రావడంతో ఉద్ధవ్ థాక్రే అప్రమత్తం అయ్యారు. దీంతో బాలాసాహెబ్ పేరును షిండే వర్గం వాడుకోకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు శివసేన పార్టీలో తిరుగుబాటు నేపథ్యంలో రెబెల్స్ పై వేటు కోరుతూ ఈసీని కలిసేందుకు శివసేన నేతలు సిద్దమవుతున్నారు.












Click it and Unblock the Notifications