Shock: ఇద్దరు మహిళల దారుణ హత్య, శవాలు ముక్కలు చేసి నదిలో చల్లిన శాడిస్టులు !

బెంగళూరు/ మండ్య: దక్షిణ భారతదేశంలోనే చెక్కరనాడుగా ప్రసిద్ది చెందిన ప్రాంతంలో ఇద్దరు మహిళలను దారుణంగా హత్య చేశారు. మహిళలను హత్య చేసిన నిందితులు ఇద్దరి శవాలను ముక్కలు ముక్కలు చేసి కావేరీ నదిలో విసిరేశారు. ఓ ప్రాంతంలో మహిళ శరీరంలోని కొన్ని భాగాలు చూసిన రైతులు హడలిపోయారు. మహిళ శవం ముక్కలు చూసి బిత్తరపోయి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అదే రోజు మరో ప్రాంతంలో మరో మహిళ శవం ముక్కలు చేసి మరో నది కాలువలో విసిరేసిన విషయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మహిళ శరీరంలోని కొన్ని భాగాలు మాత్రమే నదిలో విసిరేశారు. ఆమె శవం కూడా ముక్కలు చేసి వాటిలో కొన్ని మాత్రం నదిలో విసిరేశారని, మిగిలిన ముక్కలు మాయం చేశారని పోలీసులు అంటున్నారు. ఇద్దరు మహిళలు కేవలం కొన్ని కిలోమీటర్ల దూరంలోనే దారుణ హత్యకు గురికావడం కలకలం రేపింది.

 బిత్తరపోయిన మండ్య ప్రజలు

బిత్తరపోయిన మండ్య ప్రజలు

దక్షిణ భారతదేశంలోనే చెక్కరనాడుగా ప్రసిద్ది చెందిన కర్ణాటకోని మండ్య ప్రాంతంలో ఇద్దరు మహిళలను దారుణంగా హత్య చేశారు. మహిళలను హత్య చేసిన నిందితులు ఇద్దరి శవాలను ముక్కలు ముక్కలు చేసి కావేరీ నదిలో విసిరేశారు.ఇద్దరు మహిళలు ఒకే రోజు మండ్య జిల్లాలో, అదికూడా కొన్ని కిలోమీటర్ల దూరంలోనే హత్యకు గురికావడంతో మండ్య జిల్లా ప్రజలు హడలిపోయారు.

 బేబీ గ్రామం పక్కలో

బేబీ గ్రామం పక్కలో

మండ్య జిల్లాలోని బేబి గ్రామం సమీపంలోని కావరీ నది కాలువలో సుమారు 32 ఏళ్ల మహిళ శవమై కనిపించింది. మహిళను హత్య చేసిన నిందితులు ఆమె శవాన్ని ముక్కలు ముక్కలు చేసి కొన్ని ముక్కలు నదిలో విసిరేశారు. బేబీ గ్రామం సమీపంలోని ఆ ప్రాంతంలో మహిళ శరీరంలోని కొన్ని భాగాలు చూసిన రైతులు హడలిపోయారు. మహిళ శవం ముక్కలు చూసి బిత్తరపోయి రైతులు పోలీసులకు సమాచారం ఇచ్చారు

 శ్రీరంగపట్టణంలో కలకలం

శ్రీరంగపట్టణంలో కలకలం

అదే రోజు శ్రీరంగపట్టణం సమీపంలోని అరకెరె గ్రామంలోని ప్రాంతంలో సుమారు 43 ఏళ్ల మహిళను హత్య చేసి ఆమె శవాన్ని ముక్కలు ముక్కలు చేసి కావేరీ నది కాలువలో విసిరేసిన విషయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మహిళ శరీరంలోని కొన్ని భాగాలు మాత్రమే నదిలో విసిరేశారు.

 ఇద్దరి శవాలు పీస్ లు చేశారు

ఇద్దరి శవాలు పీస్ లు చేశారు

43 ఏళ్ల మహిళ శవం కూడా ముక్కలు ముక్కలు చేసి వాటిలో కొన్ని ముక్కలు మాత్రమే నదిలో విసిరేశారని, మిగిలిన ముక్కలు మాయం చేశారని పోలీసులు అంటున్నారు. ఇద్దరు మహిళలు కేవలం కొన్ని కిలోమీటర్ల దూరంలోనే దారుణ హత్యకు గురికావడం మండ్య జిల్లాలో కలకలం రేపింది. ఇద్దరు మహిళల హత్య కేసులు దర్యాప్తు చెయ్యడానికి 8 ప్రత్యేక టీమ్ లు ఏర్పాటు చేసిన పోలీసు అధికారులు హంతకుల కోసం గాలిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+