Student: సెలవుల్లో స్కూల్ కు పిలిపించారు. 5వ తరగతి విద్యార్థి ఎలా చనిపోయాడు ?
చెన్నై/ తుత్తుకూడి: స్కూల్ కు వెళ్లిన అబ్బాయి అక్కడ సాటి విద్యార్థులతో కలిసి కొంతసేపు ఆడుకున్నాడు. తరువాత స్కూల్ హెడ్ మాస్టర్, టీచర్లు చెప్పిన పనులు విద్యార్థులు చేశారు. స్కూల్ ఆవరణంలో ఉన్న పిచ్చి మొక్కలు మొత్తం తొలగించిన విద్యార్థులు తరువాత ఇంటికి బయలుదేరాు. ఆ సందర్బంలో గాయపడిన అబ్బాయి అనుమానాస్పద స్థితిలో చనిపోవడం కలకలం రేపింది.
తమిళనాడులోని తుత్తుకూడి జిల్లాలోని ధోప్పూర్ ప్రాంతంలో శివపెరుమాల్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. శివపెరుమాల్ కుమారుడు అజయ్ కుమార్ అక్కడి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నాడు. పరీక్షల సందర్బంగా స్కూల్ కు సెలవులు ఇచ్చారు. అదే పాఠశాలలో మెయింటెనెన్స్ పనులు జరుగుతున్నాయి.

పాఠశాల ఆవరణలో పెరిగిన మొక్కలను తొలగించేందుకు ప్రధానోపాధ్యాయురాలు ఐదవర తరగతి ఉపాధ్యాయులు కొందరు విద్యార్థులను పాఠశాలకు పిలిచారు. అజయ్ కుమార్‌తో సహా కొందరు విద్యార్థులు పాఠశాలకు వెళ్లి పని ముగించుకుని సింగిల్‌లేన్ రోడ్డు మీదుగా పాఠశాల ఎదుటకు వచ్చారు. ఆ సమయంలో అజయ్ కుమార్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.
ఐదవ తరగతి విద్యార్థి అజయ్ కుమార్ తలకు బలమైన దెబ్బ తగిలింది. పరిస్థితి విషమించడంతో అజయ్ కుమార్ ను తుత్తుకూడిలోని జిల్లా ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ అజయ కుమార్ మృతి చెందాడు. విద్యార్థి మృతికి గల కారణాలు తెలిసే వరకు మృతదేహాన్ని తీసుకోమని అజయ్ కుమార్ కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అజయ్ కుమార్ ఎలా చనిపోయాడు, సెలవులు ఉన్న సమయంలో విద్యార్థులను స్కూల్ ఎందుకు పిలిచారు ? అని ఆరా తీస్తున్నామని పోలీసులు తెలిపారు.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications