Dhaba: హైవేలో రాత్రి డాబా ఓనర్ ను చంపేసి వంట మనిషి, అంతరాత్రిలో ఏం జరిగింది ?
చెన్నై/సేలం: సొంతంగా వ్యాపారం చేస్తున్న వ్యక్తి అతని కుమారుడిని వ్యాపారం చెయ్యమని చెప్పాడు. తండ్రి నిర్వహిస్తున్న బేకరీలో చాలాకాలం పాటు కొడుకు వ్యాపారం చేశాడు. తరువాత హైవే రోడ్డు పక్కన ఉన్న డాబాను కొడుక్కు తీసుకున్నాడు. తండ్రి బేకరి, కొడుకు డాబాలో వ్యాపారం చేస్తున్నారు. ఇదే డాబాలో తండ్రి హత్యకు గురైనాడు.
తమిళనాడులోని సేలంలో కందస్వామి (60) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కందస్వామికి శరవణన్ అనే కుమారుడు ఉన్నాడు. కోయంబత్తూరు-సేలం జాతీయ రహదారిలో కందస్వామి చాలా సంవత్సరాల నుంచి సొంతంగా బేకరి నిర్వహిస్తున్నాడు. కందస్వామికి ఆయన కుమారుడు శరవణన్ చాలా సంవత్సరాల నుంచి సహకరిస్తున్నాడు.

హైవే రహదారిలో ఉన్న డాబాను గత ఏడాది కందస్వామి కుమారుడు శవరణన్ లీజ్ కు తీసుకున్నాడు. ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు డాబాలో శరవణన్ వ్యాపారం చేస్తున్నాడు. రాత్రి వరకు బేకరిలో వ్యాపారం చేస్తున్న కందస్వామి రాత్రి డాబాలోకి వెళ్లి అక్కడే నిద్రపోతున్నాడు. చాలాకాలం నుంచి డాబాలో కందస్వామి నిద్రపోతున్నాడు.
శరవణన్ డాబాలో మెట్టుపాళ్యంలో నివాసం ఉంటున్న జోసెఫ్ (30) అనే యువకుడు వంట మాస్టర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. రాత్రి కందస్వామి డాబాలోకి వెళ్లిన తరువాత వంట మాస్టర్ జోసెఫ్ తో గొడవ జరిగింది. ఆ సందర్బంలో సహనం కోల్పోయిన వంట మాస్టర్ జోసెఫ్ డాబా యజమాని కందస్వామి తల మీద దాడి చేసి చంపేసి రాత్రికి రాత్రే ఎస్కేప్ అయ్యాడు. మరుసటి రోజు ఉదయం శరవణన్ డాబాలోకి వెళ్లి చూడగా అతని తండ్రి హత్యకు గురైన విషయం వెలుగు చూసింది.












Click it and Unblock the Notifications