Shock: కోడలి అక్రమ సంబంధం, ఒకేసారి నలుగురిని చంపిన మాజీ ఆర్మీ ఉద్యోగి, విరక్తితో జైల్లో ఆత్మహత్య !
గురుగ్రామ్: కోడలి అక్రమ సంబంధం గురించి తెలుసుకున్న ఆమె మామ రిగిలిపోయాడు. బుద్దిమార్చుకోవాలని కోడలికి ఆమె మామ చాలాసార్లు చెప్పాడని తెలిసింది. ఎంత చెప్పినా కోడలు ఆమె పద్దతి మార్చుకోలేదని మామ రగిలిపోయాడు. మాజీ ఆర్మీ ఉద్యోగి అయిన మామ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. తమ కుటుంబం పరువు పోతుందని కోపంతో కోడలితోపాటు మరో ముగ్గురిని దారుణంగా నరికి చంపేశాడ. నాలుగు హత్యల కేసులో అరెస్టు అయిన మామ జైల్లో ఉన్నాడు. జైల్లో హిందీ పద్యాలు, పాటు రాసుకుంటున్న మామ అదే నోట్ ప్యాడ్ మీద డెత్ నోట్ రాసిపెట్టి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవాడం కలకలం రేపింది.

మాజీ ఆర్మీ ఉద్యోగి కోడలు అక్రమ సంబంధం !
గురుగ్రామ్ సమీపంలోని రాజేంద్ర నగర్ లో రావురాయ్ సింగ్ నివాసం ఉంటున్నాడు. రావురాయ్ సింగ్ మాజీ ఆర్మీ ఉద్యోగి. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న రావురాయ్ సింగ్ ఆ ప్రాంతంలో మంచిపేరు పెట్టుకున్నాడు. రావురాయ్ సింగ్ కుమారుడి భార్య సునీత వారి అద్దె ఇంటిలో నివాసం ఉంటున్న క్రిషన్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని ఆరోపణలు ఉన్నాయి.

కోడలికి బుద్దిమాటలు చెప్పిన మామ
కోడలు సునీత అక్రమ సంబంధం గురించి తెలుసుకున్న ఆమె మామ రావురాయ్ సింగ్ రిగిలిపోయాడు. బుద్దిమార్చుకోవాలని కోడలు సునీతకు ఆమె మామ రావురాయ్ సింగ్ చాలాసార్లు చెప్పాడని తెలిసింది. ఎంత చెప్పినా కోడలు సునీత ఆమె పద్దతి మార్చుకోలేదని మామ రావురాయ్ సింగ్ రగిలిపోయాడు.

కోడలితో పాటు ఒకేసారి నలుగురిని చంపేసిన మామ
తన కోడలు సునీత అక్రమ సంబంధం వదులుకోవడానికి సిద్దంగా లేదని తెలుసుకున్న ఆమె మామ రావుసింగ్ రిగిలిపోయాడు. బుద్దిమార్చుకోవాలని చెప్పినా నా మాట వినడం లేదని ఆగస్టు 24వ తేదీన సునీత, అద్దె ఇంటిలో నివాసం ఉంటున్న క్రిషన్, అనామిక తివారీ, వారి తోమ్మిది సంవత్సరాల కుమార్తెను దారుణంగా చంపేసిన రావురాయ్ సింగ్ తరువాత పోలీసుల ముందు లొంగిపోయాడు.

జైల్లో ఆత్మహత్య చేసుకున్న మామ
ఆగస్టు 27వ తేదీ నుంచి రావుసింగ్ రాయ్ భోండి జైల్లో ఉంటున్నాడు. రావుసింగ్ రాయ్ భార్య కూడా జైల్లో ఉంది. జైలు జీవితం గడుపుతున్న రావురాయ్ సింగ్ హిందీలు పద్యాలు రాసుకోవడానికి పేపర్ ప్యాడ్, పెన్నులు ఇచ్చారు. మంగళవారం జైల్లోని బాత్ రూమ్ లు, బ్యారక్ ల మద్యో బెడ్ షీట్ తో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని అధికారులు అన్నారు.
Recommended Video

చేసిన తప్పుకు విచారం వ్యక్తం చేస్తూ డెత్ నోట్
రావురాయ్ సింగ్ ఆత్మహత్య చేసుకునే ముందు హిందీలో డెత్ నోట్ రాసి పెట్టాడని పోలీసు అధికారులు అంటున్నారు. తాను నలుగురిని హత్య చేసి చాలా తప్పు చేశానని, నేను చేసిన తప్పుకు నా భార్య ఇప్పుడు జైల్లో ఉందని విచారం వ్యక్తం చేస్తూ డెత్ నోట్ రాసాడని పోలీసు అధికారులు అంటున్నారు. నలుగురిని దారుణంగా హత్య చేసిన మాజీ ఆర్మీ ఉద్యోగి రావురాయ్ సింగ్ చేసిన తప్పుకు కుమిలిపోయి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. మాజీ ఆర్మీ ఉద్యోగి రావురాయ్ సింగ్ ఆత్మహత్య చేసుకున్న విషయం మొదట అతని భార్యకు చెప్పడానికి వెనుకా ముందు ఆలోచించిన పోలీసు అధికారులు చివరికి ఆమెకు అసలు విషయం చెప్పారని తెలిసింది. ఒకే కుటుంబంలో వరుసగా విషాదాలు చోటు చేసుకోవడంతో రావురాయ్ సింగ్ బంధులు విచారం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications