40సెకన్ల ఇంటర్వ్యూ.. యూఎస్ వీసా రిజెక్టెడ్.. ప్రశ్నలివే!
యూఎస్ వెళ్లాలని భావించే వారికి వీసాల విషయంలో వరుసగా షాక్ తగులుతుంది. యూఎస్ వెళ్లాలని భావించే విద్యార్థుల తల్లిదండ్రులకు, అక్కడ చదువుకోవాలని భావిస్తున్న భారతీయ విద్యార్థులకు కారణమే లేకుండా వీసాలను రిజెక్ట్ చేస్తున్న పరిస్థితి ఉంది. తాజాగా ముంబై కి చెందిన ఒక విద్యార్థి తనను 40 సెకండ్ల ఇంటర్వ్యూ తర్వాత వీసా రిజెక్ట్ చేశారని, తన వీసా నిరాకరించడానికి వారు చెప్పిన కారణం చెప్పి లబోదిబోమన్నాడు.
ఉన్నత విద్య కోసం యూఎస్ వెళ్లాలనుకున్న భారతీయ విద్యార్థికి షాక్
ప్రస్తుతం ఈ విషయాన్ని జాతీయ మీడియా హైలెట్ చేస్తోంది.ముంబైలోని యూఎస్ కాన్సులేట్ లో ఇటీవల జరిగిన ఎఫ్ వన్ వీసా ఇంటర్వ్యూ ఒక భారతీయ విద్యార్థికి ఊహించని షాక్ ని ఇచ్చింది. యుఎస్ ఇమిగ్రేషన్ మరియు జాతీయత చట్టంలోని సెక్షన్ 214బి కింద దరఖాస్తుదారులు ఎదుర్కొంటున్న సవాళ్లను ఈ ఘటన హైలెట్ చేసింది.

నలభై సెకన్ల ఇంటర్వ్యూ.. వీసా రిజెక్ట్
2025 సంవత్సరంలో 9.15 cgpa తో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లో బ్యాచులర్స్ డిగ్రీ పూర్తి చేసిన ఒక విద్యార్థి ఎఫ్ వన్ వీసా కోసం ముంబైలోని యూఎస్ కాన్సులేట్ కు వెళ్ళాడు. అక్కడ కౌన్సిలర్ అధికారి సరిగ్గా నలభై సెకండ్ల పాటు ఇంటర్వ్యూ చేశారు. ఎటువంటి కారణం చెప్పకుండా వీసా రిజెక్ట్ చేశారు.
అధికారి అడిగిన ప్రశ్నలు ఇవే
ఆ అధికారి అడిగిన ప్రశ్నల విషయానికి వస్తే మీరు ఎప్పుడు మీ డిగ్రీ ని పూర్తి చేశారు? దానికి ఆ విద్యార్ధి 2017లో 9.15 cgpa తో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బ్యాచిలర్స్ పూర్తి చేశాను అని బదులిచ్చాడు. మీరు ఏ ఇతర విశ్వవిద్యాలయాలకు దరఖాస్తు చేసుకున్నారు? అని మరో ప్రశ్న అడిగారు.
తిరస్కరణ స్లిప్ లో చెప్పింది ఇదే
టెంపుల్ యూనివర్సిటీ, రోవాన్ యూనివర్సిటీ, ఫ్లోరిడా అట్లాంటిక్ యూనివర్సిటీ కానీ నేను i20 ని టెంపుల్ యూనివర్సిటీలో ప్రాసెస్ చేశాను అని విద్యార్థి సమాధానమిచ్చాడు ఆ తర్వాత కౌన్సిలర్ అధికారి విద్యార్థిని ఎడమ చేతి వేళ్లను స్కానర్ పై ఉంచమని చెప్పి ఆపై తిరస్కరించినట్టు తిరస్కరణ స్లిప్ అందజేశాడు. ఆ స్లిప్ లో స్వదేశం తో బలమైన సంబంధాలను ప్రదర్శించ లేదని పేర్కొన్నారు.
యూఎస్ వెళ్లాలని ప్రయత్నం చేస్తున్న f1 స్టూడెంట్ ఇంటర్వ్యూల పరిస్థితి ఇదే
కేవలం 30 నుంచి 40 సెకండ్లలోపు జరిగిన ఇంటర్వ్యూలో స్వదేశంతో ఉన్న కనెక్టివిటీ కానీ, బాండింగ్ కు సంబంధించిన ఎటువంటి ప్రశ్నలు అడగకుండానే, ఆ విద్యార్థి వీసాను రిజెక్ట్ చేశారు. ఈ అనుభవం USలో చదువుకోవాలని ఆశపడుతున్న, యూఎస్ కి వెళ్లాలని ప్రయత్నం చేస్తున్న విద్యార్థుల ఎఫ్ వన్ వీసా ఇంటర్వ్యూల పరిస్థితిని కళ్లకు కడుతుంది.












Click it and Unblock the Notifications