ఉద్యోగులకు షాకిచ్చిన ఇన్ఫోసిస్! త్వరలో వందలమంది తొలగింపు.. సీనియర్లే టార్గెట్!
భారత్‌లో కీలక ఐటీ కంపెనీలు వరుస పెట్టి ఉద్యోగులకు షాక్ ఇస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలో ఇన్ఫోసిస్ కూడా చేరింది. వందల మంది ఉద్యోగులను ఇన్ఫీ తొలగించడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
బెంగుళూరు: భారత్‌లో కీలక ఐటీ కంపెనీలు వరుస పెట్టి ఉద్యోగులకు షాక్ ఇస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలో ఇన్ఫోసిస్ కూడా చేరింది. వందల మంది ఉద్యోగులను ఇన్ఫీ తొలగించడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
పనితీరును సమీక్షిస్తున్న ఇన్ఫోసిస్ త్వరలోనే ఉద్యోగులను తొలగించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. కంపెనీ ప్రమాణాలను అందుకోని ఉద్యోగులందరినీ తొలగించాలని ఇన్ఫోసిస్ యోచిస్తున్నట్లు తెలిసింది.

తొలగింపుకు గురవనున్న వారిలో ఎక్కువగా గ్రూప్ ప్రాజెక్టు మేనేజర్లు, సీనియర్లు ఉన్నట్లు సమాచారం. గత వారం కాగ్నిజెంట్, విప్రోలు ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇప్పుడు ఇన్ఫోసిస్ కూడా ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమవుతోంది. 10 నుంచి 20 ఏళ్లు సర్వీసు ఉన్న సీనియర్ ఉద్యోగులే లక్ష్యంగా ఇన్ఫోసిస్ తొలగింపు కార్యక్రమం చేపడుతున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications