Shock: రూమ్ లోకి వెళ్లిన మామ, కోడలిని చూసి రగిలిపోయాడు, తుపాకితో కాల్చి చంపేశాడు, అసలు మ్యాటర్ !

ముంబాయి/థాణే: కుటుంబ సభ్యులు చూపించిన వ్యక్తిని వివాహం చేసుకున్న మహిళ ఆమె భర్తతో కాపురం చెయ్యడానికి అత్తారింటికి వెళ్లింది. మహిళ కాపురం చెయ్యడానికి వెళ్లిన భర్త కుటుంబ సభ్యులు ఉమ్మడి కాపురం ఉంటున్నారు. మహిళ, ఆమె భర్త, అతని తల్లిదండ్రులు, వారి అన్నదమ్ములు, వారి భార్యలు అందరూ ఒకే ఇంటిలో ఉంటున్నారు. ప్రతిరోజు అత్తమామలకు ఆమె టిఫిన్, కాఫీలు, భోజనాలు పెడుతోంది. ఉదయం నుంచి మద్యాహ్నం వరకు మామ ఆయన రూమ్ లోనే ఉన్నాడు. మామ నాలుగైదుసార్లు ఆయన కోడలిని పిలిచారు. మామ ఎంత పిలిచినా కోడలు మాత్రం పలకకుండా ఆమె పని ఆమె చేసుకుంటూ ఉండిపోయింది.

కోడలిని పిలిచి పిలిచి విసిగిపోయాడు. కొంత సేపటి తరువాత మామ ఆయన రూమ్ లో నుంచి బయటకు వచ్చి ఇంట్లో ఉన్న తుపాకి తీసుకుని కోడలు ఉన్న రూమ్ లోకి వెళ్లాడు. అంతే అక్కడ సీన్ చూసిన మామ తుపాకితో ఆయన కోడలి మీద కాల్పులు జరపడంతో కుటుంబ సభ్యులు హడలిపోయారు. తుపాకి తూటాలు దూసుకోవడంతో కోడలు కుప్పకూలిపోయింది. తోటి కోడళ్లు, బావ కలిసి ఆమెను ఆసుపత్రికి తరలించిన తరువాత ఆమె ప్రాణాలు పోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. మామ ఆయన కోడలిని ఎందుకు తుపాకితో కాల్చిపారేశాడు అని మ్యాటర్ తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు హడలిపోయారు.

భర్తతో కాపురం చెయ్యడానికి వెళ్లిన మహిళ

భర్తతో కాపురం చెయ్యడానికి వెళ్లిన మహిళ

మహారాష్ట్రలోని థాణేలోని రబోడికి ప్రాంతంలో కాశీనాథ్ బందురంగ్ పాటిల్ అలియాస్ కాశీనాథ్ పాటిల్ (76) అనే ఆయన నివాసం ఉంటున్నాడు. 15 సంవత్సరాల క్రితం కాశీనాథ్ పెద్ద కొడుక్కి సీతల్ (పేరు మార్చడం జరిగింది) అనే మహిళతో వివాహం జరిగింది. భర్తతో కాపురం చెయ్యడానికి సీతల్ కొన్ని సంవత్సరాల క్రితం ఆయన ఇంటికి వెళ్లింది. ప్రస్తుతం సీతల్ వయసు 42 సంవత్సరాలు.

 ఉమ్మడి కాపురం

ఉమ్మడి కాపురం

కాశీనాథ్ ముగ్గురు కొడుకులకు వివాహం చేశాడు. ముగ్గురు కొడుకులతో పాటు కోడళ్లు, కాశీనాథ్, ఆయన భార్య ఒకే ఇంటిలో ఉంటున్నారు. సీతల్, ఆమె భర్త, అతని తల్లిదండ్రులు, వారి అన్నదమ్ములు, వారి భార్యలు అందరూ ఒకే ఇంటిలో ఉంటున్నారు. ఇంటిలో కాశీనాథ్ అతని ముగ్గురు కోడులు, కోడళ్లతో కలిసి ఇంతకాలం సంతోషంగానే ఉంటున్నాడు.

 మామకు సేవలు చేస్తున్న కోడలు

మామకు సేవలు చేస్తున్న కోడలు

ప్రతిరోజు అత్తమామలకు సీతల్ టిఫిన్, కాఫీలు, భోజనాలు పెడుతోంది. అయితే మామ కాశీనాథ్ ఎప్పుడుపడితే అప్పుడు టీలు అడుగుతుండటంతో ఆయనకు సీతల్ ఎక్కువగా సేవలు చేస్తోంది. ఉదయం నుంచి మద్యాహ్నం వరకు మామ కాశీనాథ్ ఆయన రూమ్ లోనే ఉన్నాడు. కాశీనాథ్ నాలుగైదుసార్లు ఆయన కోడలు సీతల్ ను పిలిచారు.

 రగిలిపోయిన మామ

రగిలిపోయిన మామ

మామ కాశీనాథ్ ఎంత పిలిచినా కోడలు మాత్రం పలకకుండా ఆమె పని ఆమె చేసుకుంటూ ఉండిపోయింది. కాశీనాథ్ ఆయన కోడలు సీతల్ ను పిలిచి పిలిచి విసిగిపోయాడు. కొంత సేపటి తరువాత కాశీనాథ్ ఆయన రూమ్ లో నుంచి బయటకు వచ్చి ఇంట్లో ఉన్న తుపాకి తీసుకుని కోడలు సీతల్ ఉన్న రూమ్ లోకి వెళ్లాడు. అంతే అక్కడ కోడలు తాఫీగా కుర్చుని ఫోన్ లో మాట్లాడుతున్న సీన్ చూసిన మామ కాశీనాథ్ తుపాకితో ఆయన కోడలి మీద కాల్పులు జరిపా

 కోడలి ప్రాణం పోయింది...... హడలిపోయిన కుటుంబ సభ్యులు

కోడలి ప్రాణం పోయింది...... హడలిపోయిన కుటుంబ సభ్యులు

కాశీనాథ్ ఆయన కోడలు సీతల్ మీద తుపాకితో కాల్పులు జరపడంతో కుటుంబ సభ్యులు హడలిపోయారు. తుపాకి తూటాలు దూసుకోవడంతో సీతల్ కుప్పకూలిపోయింది. తోటి కోడళ్లు, బావ కలిసి సీతల్ ను ఆసుపత్రికి తరలించారు. అయితే ఐసీయూలో చికిత్స పొందుతున్న కోడలు శుక్రవారం ప్రాణాలు వదిలేసింది. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. కాశీనాథ్ టీ కావాలని, టిఫిన్ పెట్టాలని ఆయన కోడలు సీతల్ కు నాలుగైదుసార్లు చెప్పాడని, ఆమె ఏమాత్రం పట్టించుకోలేదని తుపాకితో కాల్చిపారేశాడని అసలు మ్యాటర్ తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు షాక్ అయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+