వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Shock: టైమ్ పాస్ చేస్తున్న 10వ తరగతి కొడుకు ఏం చేశాడంటే, నిద్రపోతున్న తండ్రిని ?, పక్కింటోళ్లు !

|
Google Oneindia TeluguNews

భోపాల్/మధ్యప్రదేశ్: బాగా చదువుకుని మంచి ఉద్యోగం చెయ్యాలని తండ్రి అతని కొడుక్కి చెబుతూ వస్తున్నాడు. 10వ తరగతికి వచ్చిన కొడుకు సక్రమంగా చదవకపోవడంతో తండ్రి అతని కొడుకును కొన్ని నెలలుగా మందలిస్తున్నాడు. ఇటీవల 10వ తరగతి పరీక్షలు దగ్గరపడుతున్న సమయంలో కొన్ని నెలల ముందు నుంచి ఎక్కువగా బయట స్నేహితులతో కలిసి తిరుగుతూ టైమ్ పాస్ చేస్తున్న కొడుకును అతని తండ్రి చితకబాదేశాడు. 10వ తరగతి పరీక్షలకు తాను సక్రమంగా చదవడం లేదని, నేను ఫెయిల్ అవుతానని కొడుకులో ఆందోళన మొదలైయ్యింది. కొన్ని సంవత్సరాల నుంచి పక్కింటిలో నివాసం ఉంటున్న వారితో 10వ తరగతి చదువుతున్న అబ్బాయి కుటుంబ సభ్యులకు గొడవలు ఉన్నాయి. రాత్రి భోజనం చేసిన తండ్రి టైమ్ పాస్ చేస్తూ టీవీ చూస్తున్న కొడుకును చితకబాదేశాడు. నువ్వు 10వ తరగతి ఫెయిన్ అయితే నీ అంతు చూస్తానని, నిన్ను ఇంటి నుంచి బయటకు గెంటేస్తానని తండ్రి అతని కొడుకుకు గట్టిగా వార్నింగ్ ఇచ్చి తరువాత రూమ్ లో వెళ్లి నిద్రపోయాడు. అర్దరాత్రి దాటిన తరువాత రూమ్ లో ఉన్న వ్యక్తి హత్యకు గురైనాడు. తన తండ్రిని పక్కింటి వ్యక్తులు హత్య చేసి పారిపోయారని 10వ తరగతి అబ్బాయి గట్టిగా కేకలు వేశాడు. పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో స్టోరీ మొత్తం రివర్స్ అయ్యింది.

Daughter: ఊర్లో ప్రియుడు, పక్కఊర్లో కాబోయే మొగుడు, కూతురి గొంతు చీల్చి చంపేసిన తండ్రి, తల్లి చూసి !Daughter: ఊర్లో ప్రియుడు, పక్కఊర్లో కాబోయే మొగుడు, కూతురి గొంతు చీల్చి చంపేసిన తండ్రి, తల్లి చూసి !

కొడుకును బాగా చదివించాలని ఆశ

కొడుకును బాగా చదివించాలని ఆశ


మధ్యప్రదేశ్ లోని గుణ ప్రాంతంలో తులిచంద్ అకిర్వార్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. తులిచంద్ కు 15 ఏళ్ల కొడుకు ఉన్నాడు. బాగా చదువుకుని మంచి ఉద్యోగం చెయ్యాలని తులిచంద్ అతని కొడుక్కి చెబుతూ వస్తున్నాడు. నువ్వు మంచి ఉద్యోగం చేసి మమ్మల్ని బాగా చూసుకోవాలని తులిచంద్ అతని కొడుకు పదేపదే చెబుతున్నాడు.

 10వ తరగతి చదువుతున్న కొడుకు

10వ తరగతి చదువుతున్న కొడుకు


10వ తరగతికి వచ్చిన కొడుకు సక్రమంగా చదవకపోవడంతో తులిచంద్ అతని కొడుకును కొన్ని నెలలుగా మందలిస్తున్నాడు. ఇటీవల 10వ తరగతి పరీక్షలు దగ్గరపడుతున్న సమయంలో కొన్ని నెలల ముందు నుంచి ఎక్కువగా బయట స్నేహితులతో కలిసి తిరుగుతూ టైమ్ పాస్ చేస్తున్న కొడుకును అతని తండ్రి తులిచంద్ చితకబాదేస్తున్నాడని సమాచారం.

బుద్దిమాటలు చెబుతున్న తల్లి

బుద్దిమాటలు చెబుతున్న తల్లి

10వ తరగతి పరీక్షలకు తాను సక్రమంగా చదవడం లేదని, నేను ఫెయిల్ అవుతానని తులిచంద్ కొడుకులో ఆందోళన మొదలైయ్యింది. నువ్వు బాగా చదువుకోవాలని, అప్పుడు నీ తండ్రి నిన్ను ఏమీ అనడని, నీకు ఏమికావాలన్నా నేను తీసిస్తానని కొడుక్కి తులిచంద్ భార్య బుద్దిమాటలు చెబుతూ వస్తోంది.

పక్కింటి వాళ్లతో తులిచంద్ ఫ్యామిలీకి గొడవలు

పక్కింటి వాళ్లతో తులిచంద్ ఫ్యామిలీకి గొడవలు

తులిచంద్ ఇంటి పక్కనే వీరంద్ర అనే వ్యక్తి కుటుంబ సభ్యులు నివాసం ఉంటున్నారు. కొన్ని సంవత్సరాల నుంచి పక్కింటిలో నివాసం ఉంటున్న వీరంద్ర కుటుంబ సభ్యులతో తులిచంద్ కుటుంబ సభ్యులు గొడవలు పడుతున్నారు. చిన్నచిన్న విషయాలకు తులిచంద్, వీరంద్ర కుటుంబ సభ్యులకు గొడవలు జరుగుతున్నాయని సమాచారం.

కొడుకును చితకబాది నిద్రపోయిన తండ్రి... అర్దరాత్రి శవమైనాడు

కొడుకును చితకబాది నిద్రపోయిన తండ్రి... అర్దరాత్రి శవమైనాడు

రాత్రి భోజనం చేసిన తులిచంద్ టైమ్ పాస్ చేస్తూ టీవీ చూస్తున్న కొడుకును చితకబాదేశాడు. 10వ తరగతి పరీక్షలు జరుగుతున్న సమయంలో నువ్వు ఏమి చేస్తున్నావని, టీవీ చూడటానికి వేళాపాళ లేదా అంటూ మండిపడ్డాడు. నువ్వు 10వ తరగతి ఫెయిన్ అయితే నీ అంతు చూస్తానని, నిన్ను ఇంటి నుంచి బయటకు గెంటేస్తానని తులిచంద్ అతని కొడుకుకు గట్టిగా వార్నింగ్ ఇచ్చి తరువాత రూమ్ లో వెళ్లి నిద్రపోయాడు.

పక్కింటి వాళ్లు చంపేశారని కేకలు వేసిన కొడుకు

పక్కింటి వాళ్లు చంపేశారని కేకలు వేసిన కొడుకు

అర్దరాత్రి దాటిన తరువాత రూమ్ లో నిద్రపోతున్న తులిచంద్ హత్యకు గురైనాడు. తన తండ్రి తులిచంద్ ను పక్కింటిలో నివాసం ఉంటున్న వీరేంద్ర హత్య చేసి పారిపోయాడని 10వ తరగతి అబ్బాయి గట్టిగా కేకలు వేశాడు. పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేశారు. తులిచంద్ హత్య కేసులో పక్కింటిలో నివాసం ఉంటున్న వీరేంద్రను అదుపులోకి తీసుకుని విచారణ చేశారు.

కొడుకు డ్రామాలు రివర్స్

కొడుకు డ్రామాలు రివర్స్


పోలీసుల విచారణలో వీరేంద్ర హత్య చెయ్యలేదని, ఆ సమయంలో తులిచంద్ ఇంటి ముందు అతను వెళ్లాడని వెలుగు చూసింది. చివరికి తులిచంద్ కొడుకు మీద పోలీసులకు అనుమానం వచ్చి అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. తాను 10వ తరగతి పరీక్షలకు సక్రమంగాచదవడం లేదని, పరీక్షల్లో నేను ఫెయిల్ అయితే తన తండ్రి ఇంటి నుంచి బయటకు తరిమేస్తాడని భయంతో తానే హత్య చేశానని తులిచంద్ కొడుకు అంగీకరించడంతో అందరూ షాక్ అయ్యారు. పరీక్షలకు బాగా చదవలేదని భయంతో కన్నతండ్రి తులిచంద్ ను హత్య చేసిన అతని కొడుకును అరెస్టు చేసి జువైనెల్ కోర్టు ముందు హాజరుపరిచామని, కోర్టు ఆదేశాలతో బాలుడిని బాలనేరస్తుల కారాగారానికి తరలించామని స్థానిక పోలీసులు తెలిపారు.

English summary
Shock: A 15-year-old boy killed his father over fears that he would fail in the Class 10 exam in Madhya Pradesh's Guna, the police said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X