Shock: ఐటీ హబ్ లో అనుమానాస్పద బ్యాగ్, కలకలం రేపిన చార్జర్, స్వాతంత్ర దినోత్సవం !
బెంగళూరు: స్వాతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే సందర్బంగా భారతదేశంలోని ప్రధాన నగరాలు, సున్నితమైన ప్రాంతాలు, పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్న విషయం తెలిసిందే. స్వాతంత్ర అమృత మహోత్సవాలు ఘనంగా నిర్వహించాలని అన్ని ఏర్పాట్లు చేస్తున్న సందర్బంగా ఐటీ హబ్ బెంగళూరు నగరంలో నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో అనుమానాస్పదంగా బ్యాగ్ కనపడటం కలకలం రేపింది. విషయం తెలుసుకున్న స్థానికులు భయంతో హడలిపోయారు.
స్వాతంత్ర అమృత మహోత్సవాలు ఘనంగా నిర్వహించాలని దేశ వ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దేశంలోని సున్నితమైన ప్రాంతాలు, ప్రధాన నగరాల్లో ఇప్పటికే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో బెంగళూరు నగరంలోని నిత్యం రద్దీగా ఉండే రిచ్ మెండ్ సర్కిల్ లో అనుమానాస్పదంగా ఓ బ్యాగ్ కనపడటం కలకలం రేపింది.

బ్యాగ్ వదిలేసి వెళ్లిపోవడం, ఎంత సేపటికి అక్కడికి ఎవ్వరూ రాకపోవడంతో స్థానికులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. బెంగళూరు సెంట్రల్ విభాగం డీసీపీతో పాటు పోలీసులు, బాంబు నిర్వీర్యదళం సిబ్బంది, పోలీసు జాగిలాలతో సంఘటనా స్థలానికి చేరుకుని క్షుణ్ణంగా పరిశీలించారు.
బ్యాగ్ లో బ్యాటరీలు, ఎలక్ట్రానిక్ పరికరాలు బయటపడ్డాయి. అయితే బ్యాగ్ లో ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని పోలీసు అధికారులు చెప్పారని కన్నడ మీడియా అంటోంది. అయితే బ్యాగ్ ఎవరిది ?, అక్కడ ఎందుకు వదిలేసి వెళ్లారు ? అని పోలీసు అధికారులు ఆరా తీస్తున్నారు. అయితే పోలీసు అధికారుల నుంచి మరింత సమాచారం రావలసి ఉందని కన్నడ మీడియా అంటోంది.












Click it and Unblock the Notifications