షాకింగ్: నిరసనకారుల పైకి కత్తి దూసి బెదిరించిన బీజేపీ నేత, వీడియో వైరల్
అహ్మదాబాద్: గుజరాత్ ఎన్నికల ప్రచారం మంగళవారంతో ముగిసింది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు జోరుగా ప్రచారం నిర్వహించాయి. ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్ గాంధీలు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు.
అయితే, ప్రచారం సందర్భంగా మెహ్సానాలో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. ప్రచారం సమయంలో తమను అడ్డగించిన నిరసనకారుల పైకి ఓ బీజేపీ నేత కత్తి దూశాడు.
సమాచారం మేరకు మెహెన్సా జిల్లా బీజేపీ ఐటీ సెల్ ప్రెసిడెంట్ చంద్రేశ్ తన చేతిలో ఉన్న కత్తితో నిరసనకారులను బెదిరించాడని తెలుస్తోంది. ఆ సమయంలో నిరసనకారులు పచోట్ జిల్లాలో బీజేపీ అభ్యర్థి రజనీ పటేల్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు.
అప్పుడు ఆగ్రహంతో ఊగిపోయిన సదరు నేత నిరసనకారులకు కత్తి చూపించి బెదిరించారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్లో హల్‌చల్ అవుతోంది.












Click it and Unblock the Notifications