ఐఏఎస్ అధికారిణి ఇంటిని అద్దెకు తీసుకుని.. గుట్టుగా వ్యభిచారం..
ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్ రాజ్ లోని కిడ్ గంజ్ లో షాకింగ్ ఘటన జరిగింది. ఐఏఎస్ అధికారిణి ఇంటిని అద్దెకు తీసుకున్న ఓ వ్యక్తి.. ఆ ఇంట్లో గుట్టుగా వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఓ టీమ్ గా ఏర్పడి వ్యభిచార గృహంపై దాడులు నిర్వహించారు. నలుగురు మహిళలు, ఐదుగురు పురుషులను అరెస్ట్ చేశారు. ఇంటిలోని పలు రూమ్స్ లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఈ ఇల్లు ఐఏఎస్ అధికారిణినిది కాగా ఓ వ్యక్తి మూడు నెలల క్రితం అద్దెకు తీసుకున్నట్లు సమాచారం. నెలకు రూ. 15 వేల అద్దె కడుతూ వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో షాకింగ్ ఘటన జరిగింది. ఓ మహిళా ఐఏఎస్ అధికారిణి కిద్ గంజ్ ప్రాంతంలోని తన ఇంటిని మూడు నెలల క్రితం సర్వేష్ ద్వివేది అనే వ్యక్తికి అద్దెకు ఇచ్చింది. ఇంటి అద్దె నెలకు రూ. 15 వేలు కడుతున్నాడు ద్వివేది. అయితే ఇటీవలి కాలంలో ఆ ఇంటికి పలువురు వచ్చిపోవడం స్థానికులు గమనించారు. పగలూ రాత్రి అని తేడా లేకుండా ఆ ఇంటికి పురుషులు, మహిళలు వస్తుండేవారు. దాంతో అనుమానం వచ్చిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు.
ఈ క్రమంలో పోలీసులు టీమ్ గా ఏర్పడి ఆ ఇంటిపై రైడ్ చేశారు. దాంతో ఆ ఇంట్లో నిర్వహిస్తున్న సెక్స్ రాకెట్ గుట్టు రట్టయింది. ఇంట్లోని వేర్వేరు గదుల్లో అభ్యంతరకరమైన పరిస్థితుల్లో లేడీస్, జెంట్స్ ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో నలుగురు మహిళలు, నలుగురు పురుషులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరితోపాటుగా ప్రధాన నిందితుడు సర్వేష్ ద్వివేదిని అరెస్ట్ చేశారు. విఠుల నుంచి ఫోన్లు, ఇతర పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు నిర్వహిస్తున్నారు.

పోలీసులు అదుపులోకి తీసుకున్న నలుగురు మహిళల్లో ఒకరు వెస్ట్ బెంగాల్, ఒకరు వారణాసి, ఇద్దరు ప్రయాగ్ రాజ్ నుంచి ఉన్నారు. ఇక అరెస్టయిన ఐదుగురు పురుషులు ప్రయాగ్ రాజ్ కు చెందినవారే. ఇక ప్రస్తుతం ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications