వైద్యుల భద్రతకు గ్యారెంటీ లేదా? ఆర్జీకర్ ఘటన తర్వాత ఏడాదికే మళ్లీ దారుణం!

పశ్చిమ బెంగాల్‌లోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న మహిళా వైద్యురాలిపై దాడి చేసి, అత్యాచారం చేస్తామని బెదిరించిన ఘటన కలకలం సృష్టించింది. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. కోల్‌కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ అండ్ ఆస్పత్రిలో వైద్యురాలిపై అత్యాచారం, హత్య జరిగిన సరిగ్గా ఏడాది తర్వాత ఈ షాకింగ్ ఘటన జరగడం రాష్ట్రంలో రాజకీయ దుమారాన్ని రేపింది. అధికార తృణమూల్ కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ మధ్య మాటల యుద్ధానికి ఇది దారి తీసింది.

ఆస్పత్రిలో జరిగిన ఘటన వివరాలిలా..
ఈ దారుణ ఘటన హౌరా జిల్లాలోని ఉలుబేరియాలో ఉన్న శరత్ చంద్ర చటోపాధ్యాయ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ రోగికి సంబంధించిన బంధువులే ఈ దాడికి పాల్పడ్డారు. సోమవారం మధ్యాహ్నం ఆ వైద్యురాలితో వారికి వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో వారు ఆమెపై దాడి చేయడమే కాక, అత్యాచారం చేస్తామని బెదిరించినట్లు తెలుస్తోంది. బాధితురాలైన వైద్యురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వెంటనే పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో ఓ వ్యక్తి హోంగార్డుగా పనిచేస్తున్నట్లు తెలిసింది. నిందితులను షేక్ సామ్రాట్, షేక్ బాబులాల్(హోంగార్డు), షేక్ హసిబుల్‌గా గుర్తించారు.

ఈ ఘటన నేపథ్యంలో బెంగాల్‌లోని వైద్యుల తరపు సంస్థ జాయింట్ ఫోరం ఆఫ్ డాక్టర్స్ ఉలుబేరియా ఆసుపత్రిని సందర్శించి, విధుల్లో ఉన్న డాక్టర్ల భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

Shocking Attack on Lady Doctor in Bengal Hospital Three Arrested

రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు
ఈ ఘటనపై ప్రతిపక్ష బీజేపీ అధికార తృణమూల్ కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకుంది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ సమిక్ భట్టాచార్య మాట్లాడుతూ.. ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ ఘటన నుంచి మమతా బెనర్జీ ప్రభుత్వం ఎలాంటి గుణపాఠం నేర్చుకోలేదని విమర్శించారు. "తృణమూల్ ఒక అస్తవ్యస్తమైన సమాజాన్ని సృష్టించింది. ఇందులో వికృతమైన హోంగార్డులు, సివిక్ వాలంటీర్లు కూడా భాగమయ్యారు. ఇక్కడ సీసీ కెమెరాల నిఘా కూడా లేదు. ఇది దురదృష్టకరం" అని ఆయన అన్నారు.

కేంద్ర మంత్రి సుకాంత మజుందార్:
కేంద్ర మంత్రి సుకాంత మజుందార్ తన 'ఎక్స్' ఖాతాలో స్పందిస్తూ.. మమతా బెనర్జీ పాలనలో బెంగాల్‌లో మహిళలు అసురక్షితంగా ఉన్నారని ఆరోపించారు. "ఆర్‌జీకర్ మెడికల్ కాలేజీలో జరిగిన అత్యాచారం, హత్య ఘటన తర్వాత ముఖ్యమంత్రి చేసిన పెద్ద పెద్ద ప్రకటనలన్నీ బట్టబయలయ్యాయి. ఉలుబేరియాలో హోమ్ గార్డు ఒక మహిళా డాక్టర్‌ను ఆసుపత్రి లోపలే వేధించి, అత్యాచారం చేస్తానని బెదిరించడం దీనికి తాజా రుజువు. ఈ సమయంలో భద్రతా సిబ్బంది కూడా లేరని బాధితురాలు ఆరోపించింది" అని ఆయన పేర్కొన్నారు.

తృణమూల్ కాంగ్రెస్ స్పందన
తృణమూల్ అధికార ప్రతినిధి అరుణ్ చక్రవర్తి ఈ ఉలుబేరియా ఘటనను ఖండించదగినది, దురదృష్టకరమైనదని అంగీకరించారు. అయితే, "నిందితులందరినీ అరెస్ట్ చేశాం. కానీ నందిగ్రామ్‌లో అత్యాచారం కేసులో బీజేపీ కార్యకర్త అరెస్ట్ అయినప్పుడు [బీజేపీ నేత] సువేందు అధికారి ఎందుకు మౌనంగా ఉన్నారు?" అని ఆయన బీజేపీపై ఎదురుదాడి చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+