Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వైరల్ వీడియో: వందే భారత్ లో ఫుడ్డా.. ? బ్రిటిష్ ఫ్యామిలీ షాకింగ్ రియాక్షన్..

ఓ బ్రిటిష్ ఫ్యామిలీ.. భారత్ లో పర్యటించింది. వందే భారత్ రైలులో ప్రయాణించింది. ట్రైన్ జర్నీ, ట్రైన్ లో పుడ్ పై సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియో పోస్టు చేసింది ఆ ఫ్యామిలీ. ప్రస్తుతం ఇన్ స్టా గ్రామ్ లో ఈ పోస్టు వైరల్ అవుతోంది. వందే భారత్ రైలులో ప్రయాణం చాల సౌకర్యవంతంగా ఉందని వాళ్లు ప్రశంసించారు. తక్కువ ట్రైన్ టికెట్స్ తో ఇలా విలాసవంతమైన ప్రయాణం తాము మునుపెన్నడూ చూడలేదని చెప్పొకొచ్చారు. అలాగే రైలులో అందించిన మీల్స్ కూడా చాలా టేస్టీగా ఉందని కితాబిచ్చారు. ఈ వీడియో వైరల్ కావడంతో ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ఇండియన్ ట్రైన్స్ ను ప్రశంసిస్తున్నారు.

ఓ బ్రిటిష్ ఫ్యామిలీ.. వందే భారత్ ఎక్స్ ప్రెస్ లో ఎంజాయ్ చేస్తున్న వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. తక్కువ ధరకే ప్రయాణం, టేస్టీ మీల్స్ గురించి వీడియోలో ప్రస్తావించారు. దాంతో వందే భారత్ ట్రైన్స్ కు కేవలం భారతీయులే కాకుండా విదేశీ ప్రయాణికులను సైతం ఫిదా అవుతున్నారు. తాజాగా ఇంగ్లాండ్ కు చెందిన ఓ ఫ్యామిలీ వందే భారత్ రైలులో ప్రయాణించింది. భార్యాభర్తలతోపాటు వారి ముగ్గురు పిల్లలతో జర్నీ చేశారు.

ఈ వీడియోలో.. వందే భారత్ రైలులో ఒక్కొక్కరికి ట్రైన్ టికెట్ ధర కేవలం 11 బ్రిటిష్ పౌండ్స్ మాత్రమే అయిందని అంటే భారత కరెన్సీలో రూ. 12,00 అని స్పష్టం చేశారు. మీల్స్ తో కలిపే ఈ ధర అయినట్లు తెలిపారు. నాలుగు గంటల ట్రైన్ జర్నీతోపాటు స్నాక్స్ కలిపి కేవలం ఒక్కొక్కరికి 11 బ్రిటిష్ పౌండ్స్ కావడం పెద్ద ఖర్చేమీ కాదని వీడియోలో పేర్కొన్నారు.

Shocking Delight British Family Raves About Vande Bharat s Bargain Fares and Gourmet Grub

ఈ వీడియోలో బ్రిటిష్ మహిళ.. ఫుడ్ బాగుందని తెలిపింది. పిల్లలకు ట్రే లో ఫుడ్ తీసుకొచ్చారని.. డైట్ స్నాక్స్, కారామెల్ పాప్ కార్న్, పొటాటో ప్యాటీస్, మ్యాంగో జ్యూస్, జింజర్ టీ పౌడర్, ఇచ్చారని తెలిపింది. టీ కూడా అమేజింగ్ గా ఉందని.. సువాసన వెదజల్లుతోందని వీడియోలో పేర్కొంది. ఈ వీడియోకు ఇప్పటికే 12 మిలియన్ వ్యూస్ వచ్చాయి. కామెంట్స్ కూడా అధికంగానే వస్తున్నాయి. విదేశీయులు.. భారత్ ను పొగుడుతుంటే ఆ కిక్కే వేరు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+