హార్ట్ టచింగ్: పాముకు చుక్కలు చూపిన తల్లి ఎలుక

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: ఏ జీవి అయిన ఎవరైనా తన పిల్లల జోలికి వస్తే ఊరుకోదు. ఓ ఎలుక పిల్లను దాదాపు ఏడు అడుగుల పాము ఆహారంగా తీసుకునేందుకు ప్రయత్నించింది. ఈ విషయాన్ని గుర్తించిన తల్లి ఎలుక.. తన పిల్లను కాపాడుకునేందుకు తీవ్ర ప్రయత్నం చేసింది.

ఎదురుగా శత్రువు తన పాము అన్నది కూడా లెక్క చేయలేదు. ప్రాణాలకు తెగించి మరీ పోరాటం చేసింది. ఆ పామును వెంటాడి మరీ తరిమి కొట్టింది. పాము బుసలు కొడుతున్నా ఆ తల్లి ఎలుక వెనక్కి తగ్గలేదు. తన పిల్లను రక్షించుకునేందుకు రెచ్చిపోయింది.

Shocking moment: rat mom saves baby hungry snake epic roadside battle

ఎలుక పోరాటం ముందు పాము పప్పులు ఉడకలేదు. దీంతో, చేసేదేం లేక పాము చిన్న ఎలుకను వదిలి వెళ్లిపోయింది. రోడ్డు పైనుంచి పొదల్లోకి జారుకుంది. చిన్న ఎలుకను నోట కరుచుకొని అక్కడి నుంచి తల్లి ఎలుక తీసుకు వెళ్లింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో హల్‌చల్ చేస్తోంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A mother rat fought off a ferocious snake in a desperate bid to save her baby.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి