షాకింగ్ స్టడీ : మే నెలలో ఒక్కరోజులోనే 10 లక్షల కేసులు , దడ పుట్టించేలా మరణాల అంచనా !!
భారతదేశంలో కరోనా మహమ్మారి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది . దేశంలో కరోనా రెండవ దశ ఉగ్రరూపం దాలుస్తోంది. రికార్డు స్థాయిలో కేసుల నమోదుతో భారత దేశంలో కరోనా కలకలం కొనసాగుతోంది. భారతదేశం మొత్తంగా ఇప్పటివరకు నమోదైన కరోనా మరణాల సంఖ్య రెండు లక్షలకు చేరువగా ఉంది. ఇదిలా ఉంటే మే నెలలో కోవిడ్ ఉద్ధృతి తారా స్థాయికి చేరనుందని మిచిగాన్ విశ్వవిద్యాలయం అధ్యయనం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది .

మే నెలలో ఒక్క రోజులో 10 లక్షలకు పైగా కేసులు నమోదు అవుతాయని అంచనా
మే నెలలో ఒక్క రోజులో 10 లక్షలకు పైగా కేసులు నమోదు అవుతాయని అంచనా వేస్తున్నారు . ఇక ఆగస్టు 1వ తేదీ వరకు దేశవ్యాప్తంగా 6.64 లక్షల మరణాలు సంభవిస్తాయని అధ్యయనం తేల్చింది.
కరోనా సెకండ్ వేవ్ లో భాగంగా తాజాగా భారత దేశంలో నెలకొన్న పరిణామాలతో భవిష్యత్తు పరిస్థితి ఎలా ఉంటుందనే అధ్యయనం చేసిన మిచిగాన్ యూనివర్సిటీ స్టడీలో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. భారత్లో మే నెల మధ్య నాటికి రోజువారి కేసుల సంఖ్య 8 నుండి 10 లక్షలకు చేరుకుంటుందని మిచిగాన్ విశ్వవిద్యాలయం హెచ్చరికలు జారీ చేస్తుంది.

23 నాటికి రోజువారీగా 4,500 మంది మరణించే అవకాశం
మరణాల సంఖ్య కూడా గణనీయంగా పెరిగే ప్రమాదం ఉందని మే 23 నాటికి రోజువారీగా 4,500 మంది మరణించే అవకాశం ఉందని తన అధ్యయనం ద్వారా తెలియజేసింది. యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ కు చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మెట్రిక్స్ ఎవాల్యువేషన్స్ మే నెల ప్రారంభంలోనే అధికారిక, అనధికారిక లెక్కలతో కలిపి రోజుకు పది లక్షలకు పైగా కరోనా కేసులు నమోదు అవుతాయని అంచనా వేసింది .
మొదటి దశలో పోలిస్తే రెండవ దశలో మరణాల సంఖ్య అధికంగా ఉండనుందని మిచిగాన్ యూనివర్శిటీ అధ్యయనాలు తేటతెల్లం చేస్తున్నాయి.ఇక ఇదే విషయాలను మిచిగాన్ యూనివర్సిటీకి చెందిన ఎపిడెమియాలజిస్ట్ భ్రమర్ ముఖర్జీ వెల్లడించారు.

రానున్న ఆగస్టు 1 నాటికి దేశంలో 6.64 ఐహెచ్ఎంఈ అంచనా
రానున్న ఆగస్టు 1 నాటికి దేశంలో 6.64 ఐహెచ్ఎంఈ అంచనా వేసింది. అమెరికాలో 2020 మార్చి నుండి 2021 జనవరి వరకు తాము అంచనా వేసిన దానికంటే 23 శాతం ఎక్కువ మరణాలు నమోదైనట్లు గా గుర్తు చేసిన అధ్యయనం, భారత్లోనూ కరోనా అల్లకల్లోలం సృష్టించబోతుందని షాకింగ్ విషయాలను వెల్లడించింది .
కరోనా మొదటి దశతో పోలిస్తే రెండవ దశలో కరోనా ఉద్ధృతి విపరీతంగా ఉందని, ప్రజల్లో నిర్లక్ష్యం, అలసత్వం వెరసి కరోనా వ్యాప్తికి కొనసాగుతుందని పేర్కొంది .

షాకింగ్ స్టడీల హెచ్చరికలతో రానున్న కష్టకాలం కోసం ఇండియా అలెర్ట్ అవుతుందా ?
కరోనా ను కట్టడి చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నా ప్రజలు మాస్కులు పెట్టుకోకపోవడం, వ్యాక్సినేషన్ ప్రక్రియ జరగకపోవడం, టెస్టుల నిర్వహణలో నిర్లక్ష్యం, ఆసుపత్రిలో వైద్య వసతుల లేమి వెరసి దేశం కరోనా విపత్తులో చిక్కుకుంది. మే నెలలో ఇది మరింత తీవ్రంగా ఉండబోతుందని, దేశం అప్రమత్తంగా ఉండాలని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
ఇప్పటికే దేశం తీవ్రమైన ఆరోగ్య సంక్షోభంలో చిక్కుకుంది. ఈ షాకింగ్ స్టడీల హెచ్చరికల నేపధ్యంలో రానున్న కష్టకాలం కోసం వైద్య వసతుల కల్పన విషయంలో దేశం దృష్టి సారించాలన్న విజ్ఞప్తి వినిపిస్తుంది .












Click it and Unblock the Notifications