వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాకింగ్ వీడియో : శవాల పక్కనే కరోనా రోగులకు ట్రీట్‌మెంట్.. ఒకే వార్డులో..

|
Google Oneindia TeluguNews

దేశంలోనే అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు నమోదైన మహారాష్ట్రలో ఓ షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ముంబై మున్సిపల్ కార్పోరేషన్ ఆధ్వర్యంలో నడిచే సియోన్ ఆసుపత్రిలో మృతదేహాల పక్కనే కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నారు. ఆ వార్డులో దాదాపు 7 మృతదేహాలు ఉన్నాయి. బీజేపీ ఎమ్మెల్యే నితేష్ రాణే ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది.

ఇలా వెలుగులోకి..

'సియోన్ ఆసుపత్రిలో కరోనా పేషెంట్లు మృతదేహాల పక్కనే నిద్రిస్తున్నారు. ఇది చాలా దారుణమైన సంఘటన. ప్రభుత్వం ఏ రకమైన అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నట్టు. సిగ్గుచేటు..' అంటూ నితేష్ రాణే ట్విట్టర్‌లో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ కాంగ్రెస్ నేత కూడా ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. రోగుల పక్కనే మృతదేహాలను ఉంచడం దారుణమన్నారు.బృహన్ ముంబై మున్సిపల్ కార్పోరేషన్ డబ్ల్యూహెచ్ఓ ప్రోట్‌కాల్‌ను ఎందుకు పాటించడం లేదని ప్రశ్నించారు. పరిమిత వనరులతోనే అయినా ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది మెరుగైన సేవలు అందిస్తున్నారని చెప్పారు. కానీ ఇలాంటి సమస్యలపై ముంబై అడ్మినిస్ట్రేషన్ దృష్టి పెట్టాలని సూచించారు.

ఆసుపత్రి డీన్ ఏమంటున్నారు..

ఆసుపత్రి డీన్ ఏమంటున్నారు..

ఘటనపై సియోన్ ఆసుపత్రి డీన్ ప్రమోద్ మాట్లాడుతూ.. కోవిడ్-19తో మృత్యువాతపడిన వారి మృతదేహాలను తీసుకెళ్లడానికి కుటుంబ సభ్యులు ముందుకురావట్లేదన్నారు. ఆసుపత్రి మార్చురీలో 15 మృతదేహాలను భద్రపరిచే సదుపాయం ఉందని.. అందులో 11 ఇప్పటికే కోవిడ్-19 మృతదేహాలతో నిండిపోయాయని చెప్పారు. ఆ వార్డులోని మృతదేహాలను కూడా తీసుకొచ్చి మార్చురీలో భద్రపరిస్తే.. ఒకవేళ ఎవరైనా కోవిడ్-19తో మరణిస్తే మృతదేహాన్ని భద్రపరిచేందుకు చోటు ఉండదన్నారు. ఇప్పుడైతే వాటిని ఆ వార్డు నుంచి తొలగించామని.. ఘటనపై విచారణ జరుపుతున్నామని తెలిపారు.

మృతదేహాలను తరలించేందుకు సిద్దం చేస్తున్న క్రమంలోనే..

మృతదేహాలను తరలించేందుకు సిద్దం చేస్తున్న క్రమంలోనే..


నిజానికి ఆ మృతదేహాలను అక్కడినుంచి తరలించేందుకు కుటుంబ సభ్యుల అంగీకారం కోసం ఎదురుచూస్తున్న తరుణంలోనే ఎవరో తెలియకుండా ఆ వీడియో తీశారని చెబుతున్నారు. ఒకసారి మృతదేహాన్ని బాడీ బ్యాగ్‌లో ప్యాక్ చేశాక.. దాని నుంచి ఎటువంటి ఇన్ఫెక్షన్ బయటకు వ్యాప్తి చెందే అవకాశం ఉండదంటున్నారు. కాగా,ఇప్పటివరకూ మహారాష్ట్రలో అత్యధికంగా 16,800 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో ముంబైలోనే 10,714 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకూ రాష్ట్రంలో 400 మంది కరోనా కారణంగా మృత్యువాతపడ్డారు.

English summary
A video shot on a phone shows coronavirus patients in a Mumbai hospital ward lying next to corpses wrapped in body bags. The horrifying clip, which is circulating on social media, is from Sion Hospital, which is run by the city's municipal corporation and is one of the major hospitals handling COVID-19 patients in Mumbai.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X