చూడ్డానికి డీసెంట్ గా ఉన్నావ్: రైలులో ఆ పాడు పనులేంట్రా..
పురుషోత్తమ్ ఎక్స్‌ప్రెస్ లో లో వింత చోరీ జరిగింది. ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్‌లో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి బెడ్‌షీట్లు, టవల్స్ దొంగిలిస్తూ పట్టుబడ్డాడు. ఎంచక్కా వాటిని తన లగేజీలో సర్దేశాడు. అది గమనించిన కోచ్ అటెండర్ ఈ తతంగం మొత్తాన్నీ గప్ చుప్ గా తన మొబైల్ లో బంధించాడు. దేబబ్రత సాహు అనే ఓ యూజర్.. దీన్ని తన ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు. దీంతో ఈ ఫన్నీ చోరీ మొత్తం వెలుగులోకి వచ్చింది.
ఢిల్లీ ఆనంద్ విహార్- పూరీ మధ్య నడిచే ఎక్స్ ప్రెస్ ఇది. ఇందులో ఫస్ట్ క్లాస్ కంపార్ట్ మెంట్ లో ఫ్యామిలీతో పాటు ట్రావెల్ చేశాడో వ్యక్తి. తన గమ్యస్థానం రావడానికి ముందు.. ఆ కంపార్ట్ మెంట్ లో ఉన్న బెడ్‌షీట్లు, టవల్స్ దొంగిలించాడు. వాటిని తన లగేజీలో దాచిపెట్టాడు. దీన్ని గమనించిన ఏసీ కోచ్ అటెండర్ వీడియో తీశాడు. తర్వాత టీటీఈకి కంప్లైంట్ చేశాడు.

"బెడ్‌షీట్లు, దుప్పట్లు అన్ని బ్యాగులో నుంచి బయటకు ఎలా వస్తున్నాయో చూడండి. టవల్స్, బెడ్‌షీట్లు మొత్తం నాలుగు సెట్లు ఉన్నాయి. వాటిని తిరిగి ఇవ్వండి లేదా 780 రూపాయల ఫైన్ కట్టండి.." అని ఆ కోచ్ అటెండెంట్ ఒడియాలో చెప్పడం చూడొచ్చు. దానికి ప్రయాణికుడు అది పొరపాటు అని, తన తల్లి తెలియకుండా ప్యాక్ చేసి ఉండవచ్చని వాదించాడం ఈ వీడియోలో రికార్డయింది.
దీనికి కోచ్ అటెండెంట్ కన్విన్స్ కాలేదు. "ఫస్ట్ ఏసీలో ప్రయాణించే తాహతు ఉన్నప్పుడు బెడ్ షీట్లను ఎందుకు దొంగిలిస్తున్నారు? నేను అడిగినప్పుడు తీర్థయాత్రకు వెళ్తున్నారని చెప్పారు కదా" అని అటెండర్ నిలదీశాడు. టీటీఈ జోక్యం చేసుకున్నారు. రైల్వే వస్తువులను చోరీ చేయడాన్ని తీవ్రమైన నేరంగా పరిగణించాల్సి ఉంటుందని చెప్పారు. "మీ పిఎన్‌ఆర్ నంబర్ ఎంత? మీరు డబ్బులు చెల్లించి రసీదు తీసుకోండి. లేకపోతే పోలీసులు వస్తారు, ఆ పిఎన్‌ఆర్ నంబర్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తాను" అని హెచ్చరించారు.
Traveling in 1st AC of Purushottam express is a matter of pride itself.
— ଦେବବ୍ରତ Sahoo 🇮🇳 (@bapisahoo) September 19, 2025
But still people are there who don't hesitate to steal and take home those bedsheets supplied for additional comfort during travel. pic.twitter.com/0LgbXPQ2Uj
సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయింది. యూజర్లు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఫస్ట్ క్లాస్ ఏసీలో ప్రయాణించడాన్ని అదృష్టంగా భావించాలని, అలాంటిది అందులో ప్రయాణిస్తూ బెడ్‌షీట్లు దొంగిలించడం అంటే ఆ వ్యక్తి మనస్తత్వం ఎటువంటిదో అర్థం చేసుకోవచ్చని ఓ యూజర్ చెప్పాడు. ప్రభుత్వ ఆస్తులు, తోటి ప్రయాణికుల పట్ల అతనికి ఏ మాత్రం గౌరవం లేదని తేలిపోయిందని కామెంట్స్ పెట్టాడు. రైల్వే ఆస్తులు, వస్తువులను కాపాడాల్సిన బాధ్యత ప్రజల పైనే ఉందని మరో వ్యాఖ్యానించారు.
-
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications