మంత్రి పైకి 'షూ' విసిరేసిన కాంగ్రెస్ నేత
న్యూఢిల్లీ : అసెంబ్లీ సమావేశాల సాక్షిగా.. ఓ మంత్రిపై షూ విసిరేయడం పంజాబ్ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పంజాబ్ మంత్రి బిక్రమ్ సింగ్ మజీతియాపై బుధవారం నాడు అసెంబ్లీలో షూ విసిరేశారు కాంగ్రెస్ నేత తర్లోచన్ సూంధ్.

పంజాబ్ లో అకాలీదళ్-బీజేపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోన్న కాంగ్రెస్.. అవిశ్వాస తీర్మానం కోసం పట్టుబట్టింది. అసెంబ్లీలో ఈ తీర్మానంపై చర్చ జరపాల్సిందిగా కాంగ్రెస్ పట్టుబడుతున్న సమయంలో.. కాంగ్రెస్ నేత సూంధ్ మంత్రి బిక్రమ్ సింగ్ పైకి షూ విసిరేశారు. దీంతో ఒక్కసారిగా అసెంబ్లీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
ఈ నేపథ్యంలోనే వాయిస్ ఓటు ద్వారా కాంగ్రెస్ డిమాండ్ ను తిరస్కరిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించడంతో.. సుమారు 22 మంది ఎమ్మెల్యేలు సోమవారం నుంచి అసెంబ్లీలోనే బైఠాయించారు.












Click it and Unblock the Notifications