వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మీరు మీ గృహ రుణాన్ని రీ ఫైనాన్స్ చేయాలనుకుంటున్నారా? అయితే మొదట ఈ 10 అంశాలు గమనించండి!

మీ గృహ రుణంపై అధిక వడ్డీలు కట్టి విసిగిపోయారా? మీ రుణదాత విధిస్తున్న ఛార్జీలు, ఫీజులతో అసంతృప్తి చెందుతున్నారా? అయితే మీరు మీ గృహ రుణానికి సంబంధించి రీ ఫైనాన్స్ కు వెళ్లాల్సిన తరుణం ఇదేనేమో.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

మీ గృహ రుణంపై అధిక వడ్డీలు కట్టి విసిగిపోయారా? మీ రుణదాత విధిస్తున్న ఛార్జీలు, ఫీజులతో అసంతృప్తి చెందుతున్నారా? అయితే మీరు మీ గృహ రుణానికి సంబంధించి రీ ఫైనాన్స్ కు వెళ్లాల్సిన తరుణం ఇదేనేమో.

మీలా గృహ రుణం తీసుకుని ఇబ్బందులు పడుతున్న వారు రీ ఫైనాన్స్ ప్రక్రియ ద్వారా తక్కువ వడ్డీ రేటు, ఇతరత్రా ప్రయోజనాలు అందిచే మరో రుణదాత వద్దకు మారిపోవడమే మంచిది. ఈ రీ ఫైనాన్స్ ద్వారా కలిగే ప్రయోజనాలు ఏమిటంటే.. అధిక గడువు, తక్కువ వడ్డీరేటుతో కూడిన టాప్ అప్ లోన్, అత్యుత్తమ కస్టమర్ సర్వీస్, అన్నిటికంటే ముఖ్యంగా పారదర్శకతతో కూడిన ఫీజుల వ్యవస్థ. దీనివల్ల అయ్యో.. మనం రుణదాతను మార్చి తప్పు చేశాం అనే భావన మీకెన్నడూ కలగదు.

హౌసింగ్ లోన్ రీఫైనాన్స్ కు వెళ్లబోయే ముందు మీరు గమనించాల్సిన 10 అంశాలు

1. ఆదాయం, అప్పు నిష్పత్తిని తనిఖీ చేసుకోండి: మీ నెలసరి ఆదాయంలో ఎంత నిష్పత్తి మేరకు మీరు అప్పు తీసుకున్నారన్నది ఇది సూచిస్తుంది. 3:7 అనేది ఆదాయం, అప్పులకు సంబంధించిన ఒక మంచి నిష్పత్తి. అంటే మీరు చేసే ప్రతి 3 అప్పులకు.. మీ ఆదాయం 7 రెట్లు ఉండాలన్న మాట. అప్పుడే మీరు తీసుకున్న అప్పును సులువుగా తీర్చగలరు. కాబట్టి మీ ఇంటి రుణానికి సంబంధించి రీఫైనాన్స్ కు వెళ్లబోయే ముందు కూడా మీరు ఈ అప్పు-ఆదాయ నిష్పత్తిని విశ్లేషించుకోవడం మంచిది. ఒకవేళ మీ ఇంటి రుణానికి సంబంధించిన నెలసరి వాయిదాలు చెల్లించడంలో మీరు గనక ఇబ్బంది పడుతుంటే, అలాగే మీ ప్రస్తుత రుణదాత విధిస్తున్న వడ్డీ రేటు కారణంగా మీ నెలసరి ఆదాయంలో అధికభాగం మీ రుణ చెల్లింపులకే ఖర్చు అవుతున్నట్లయితే... మీరు తీసుకున్న రుణ మొత్తంలో మిగిలిన భాగాన్ని మరో రుణదాత వద్దకు మార్చుకోవడం అంటే బ్యాలెన్స్ ట్రాన్స్ ఫర్ కు ఇదే సరైన సమయం.

2. రీఫైనాన్స్ లో పడే ఖర్చులను లెక్కించండి: రీ ఫైనాన్స్ విధానంలో కూడా కొన్ని ఖర్చులు కలిపి ఉంటాయి. వీటిలో ప్రాసెసింగ్ ఫీజు, దరఖాస్తు ఛార్జీలు, లీగల్ ఛార్జీలు, అలాగే కొన్నిసార్లు ముందస్తు చెల్లింపునకు కూడా ఛార్జీలు ఉంటాయి. రీఫైనాన్స్ తీసుకోబోయే ముందే గనుక వీటన్నిటి గురించి మీరు సమగ్రంగా తెలుసుకుని ఉంటే.. తీసుకున్న తరువాత ఎలాంటి అసంతృప్తికి గురవరు. రీ ఫైనాన్స్ ద్వారా మీకు ఎంతో కొంత వడ్డీ ఆదా అవుతుందని మీరు భావించే తరుణంలో మళ్లీ ఈ ఛార్జీలన్నీ కలిసి తడిసి మోపెడు అవకూడదు.

3. వడ్డీ రేట్లు మరియు గడువు: గృహ రుణానికి సంబంధించిన బ్యాలెన్స్ ట్రాన్స్ ఫర్ విషయంలో వడ్డీ రేట్లే కీలకం. ఈ వడ్డీ రేటు.. మీ రుణ చెల్లింపు కాల వ్యవధి పొడవునా మీ ఈఎంఐపై నేరుగా ప్రభావం చూపుతుంది. కాబట్టి, మీ గృహ రుణాన్ని బదలాయించే ముందే, మీ కొత్త వడ్డీ రేటు, రుణ కాల వ్యవధిలను ఒకటికి రెండుసార్లు సరి చూసుకోవడం మంచిది. రుణ కాల వ్యవధి తగ్గించి అధిక ఈఎంఐ చెల్లిస్తారా? లేదంటే వడ్డీ కాస్త ఎక్కువైనా పర్వాలేదని తక్కువ ఈఎంఐని ఎక్కువ కాలంపాటు చెల్లిస్తారా? మీరు తీసుకోబోయే ఈ నిర్ణయమే మీ రుణ మొత్తంపై ప్రభావం చూపుతుంది. మీ అవసరానికి తగిన నిర్ణయాన్ని మీరే తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త అవసరం.

4. మీ ఆదాయంపై పన్నులు: మీ గృహరుణానికి సంబంధించి మీరు కట్టే నెలసరి వడ్డీ చెల్లింపుపైనే మీ ఆదాయంలో కోత ఆధారపడి ఉంటుంది. తక్కువ వడ్డీకే మీ గృహ రుణాన్ని బదలాయించుకుంటే మీ పన్ను ఆదా తగ్గిపోవచ్చు. కాబట్టి రుణ మొత్తాన్ని బదలాయించుకునే ముందు ఒకసారి మీరు మీ చార్టెడ్ అకౌంటెంట్ నుగాని, టాక్స్ కన్సల్టెంట్ నుగాని సంప్రదించి సంప్రదించడం ఉత్తమం.

5. క్రెడిట్ స్కోరు: మీరు రుణం పొందడానికి అర్హులో కాదో నిర్ణయించేదే ఈ క్రెడిట్ స్కోరు. ఈ స్కోరు తక్కువగా ఉంటే మీరు రుణం పొందే అవకాశాలు చాలా తక్కువ. క్రెడిట్ స్కోరు అధికంగా ఉన్న వారికి చాలా సులభంగా రుణం లభిస్తుంది. కాబట్టి మీరు మీ గృహరుణం బదలాయింపు కోరే ముందే ఒకసారి మీ క్రెడిట్ స్కోర్ ఎంతుంది అనేది చూసుకోవాలి. ఒకవేళ ఈ క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉంటే దాన్ని పెంచుకునే ప్రయత్నాలపై దృష్టిసారించాలి. తక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్న వారి రుణ దరఖాస్తు తిరస్కరణకు దారి తీయవచ్చు లేదా వడ్డీ రేటు భారీగా పెరగొచ్చు.

6. కస్టమర్ సర్వీస్: కొత్త రుణదాత వద్దకు మారే ముందే ఆ రుణదాత తన కస్టమర్లకు ఏ స్థాయిలో సేవలు అందిస్తున్నారనే విషయాన్ని బాగా విశ్లేషించుకోండి. రుణం తీసుకునేప్పుడు తీసుకున్నాక ఏవైనా ఇబ్బందులు ఎదురైతే మీరు ఆధారపడాల్సింది ఈ కస్టమర్ సర్వీస్ విభాగం పైనే. మీ కొత్త రుణదాతకు సంబంధించిన కస్టమర్ సర్వీస్ గురించి మీరు ఇంటర్నెట్ లో ఆన్ లైన్ సమీక్షల ద్వారా తెలుసుకోవచ్చు. లేదంటే ఇప్పటికే ఆ సంస్థ వద్ద రుణం పొందిన వారిని విచారించడం ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఎక్కువ మంది ఏ సంస్థ కస్టమర్ సర్వీసు బాగుందంటారో అలాంటి సంస్థ వద్ద రుణం తీసుకోవడం శ్రేయస్కరం.

7. ఇంటి ఈక్విటీ లేదా విలువ: గృహ రుణాన్ని బదలాయించుకునే ముందే అసలు మీ ఇంటి విలువ ఎంతుందనేది తెలుసుకోవడం ముఖ్యం. ఈ విలువ తగ్గితే మీరు ఎక్కువ ఈఎంఐ కట్టాల్సి రావచ్చు. ఒకవేళ మీ ఇంటి విలువ తక్కువగా ఉంటే రీఫైనాన్స్ తీసుకోవడం అసాధ్యం. ఇంటి విలువ అధికంగా ఉన్న వారికే రుణదాతలు రుణ బదలాయింపు సౌకర్యం కల్పిస్తారు.

8. వడ్డీ రేట్లలో పాయింట్ల తేడా: పాయింట్లలో తేడా వచ్చినప్పుడల్లా వడ్డీ రేట్లు మారిపోతుంటాయి. రుణ దాతకు సంబంధించిన వడ్డీ రేట్ల వ్యవస్థపై ఆధారపడి ఈ పాయింట్లు పెరుగుతూ, తరుగుతూ ఉంటాయి. నిర్ణీత కాలంలో వడ్డీ రేటు ఏ మేరకు పెరిగింది, ఏ మేరకు తరిగింది అనే విషయాన్ని ఈ పాయింట్లను బట్టి అర్థం చేసుకోవచ్చు. అలాగే భవిష్యత్తులో వడ్డీ రేట్లలో తేడాను కూడా ఈ పాయింట్ల ఆధారంగా పసిగట్టవచ్చు. అధిక పాయింట్లు కలిగి ఉన్న రుణదాతకంటే కూడా పాయింట్లు తక్కువగా ఉన్న రుణ దాత వద్ద రుణం తీసుకోవడం మంచిది. ఎందుకంటే రీఫైనాన్స్ ప్రక్రియలో మీకు లభించే ప్రయోజనాలను కొన్నిసార్లు అధిక పాయింట్లు హరించివేస్తాయి.

9. సమతుల్య స్థితి( బ్రేక్ ఈవెన్ పాయింట్ ) : రుణ బదలాయింపు ప్రక్రియలో మీరు లాభపడాలిగానీ నష్టపోకూడదు. కాబట్టి రుణ బదలాయింపునకు వెళ్లే ముందే మీకు ఈ ప్రక్రియలో అయ్యే ఖర్చుల గురించి జరిగే ఆదా గురించి బాగా తెలుసుకుని ఉండాలి. ఖర్చు కన్నా ఆదా ఎక్కువగా ఉందనుకుంటేనే రుణ బదలాయింపునకు వెళ్లండి. లేదా ఈ రెండూ కనీసం సమతుల్య స్థితిలో ఉన్నా రుణ బదలాయింపునకు వెళ్లొచ్చు.

10. చలన మరియు స్థిర వడ్డీ రేట్లు: ప్రస్తుతం మార్కెట్లో స్థిర మరియు చలన వడ్డీ రేట్లకు రుణాలు అందించే సంస్థలు ఉన్నాయి. చలన వడ్డీ రేట్లు మార్కెట్ శక్తుల ప్రభావానికి లోబడి మారుతూ ఉంటాయి. కొన్నిసార్లు ఈ వడ్డీ రేటు భారీగా పెరగొచ్చు, మరికొన్నిసార్లు బాగా తగ్గొచ్చు. స్థిర వడ్డీ రేట్లు విషయంలో ఇలాంటి హెచ్చు తగ్గులు దాదాపుగా ఉండవు. స్థిర వడ్డీ రేట్లు బేస్ రేటు లేదా ఎంసీఎల్ఆర్ సిస్టంపై ఆధారపడి ఉంటాయి. సాధారణంగా రుణం గ్రహీతలు కొద్ది కాలంపాటు స్థిర వడ్డీ కలిగిన గృహరుణం తీసుకుని, ఆ తరువాత చలన వడ్డీ రేటుకు మారిపోతారు. కాబట్టి రుణం తీసుకుకోవాలని మీరు అనుకున్నప్పుడు ఆ సమయంలో మార్కెట్ ఎలా ఉంది, ఏది మీకు లాభం చేకూరుస్తుందనేది బాగా అధ్యయనం చేశాకే రుణం ఇచ్చే సంస్థను ఎంచుకోండి.

ఒక్కసారి మీరు ఈ విషయాలన్నీ విశ్లేషించుకుని, గృహ రుణానికి సంబంధించి రీఫైనాన్స్ కు వెళ్లడంలో మీకే లాభం కలుగుతుందని భావిస్తే ఇక ఆలస్యం చేయకండి. తక్కువ వడ్డీ రేటు, సులువైన టాప్ అప్ రుణం అందించే బజాజ్ ఫైనాన్స్ గృహ రుణానికి దరఖాస్తు చేయండి.

English summary
Are you tired of paying high interest on your home loan? Is your lender overburdening you with charges and fees for everything and giving you unsatisfactory service? Perhaps it is time for you to seek a house refinance. A home loan refinance is when a borrower like you shifts to a new lender to not only pay lower refinance interest rates, but also to get other benefits. These benefits may include the provision of a long-tenor top up loan at low interest, better customer service and a more transparent fee structure. However, before you go in for a housing loan refinance, it is important to pay attention to various financial factors, so that your move can be a smooth one with few repercussions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X