శ్రద్ధా వాకర్ తండ్రి మృతి.. అసలు విషాదం ఇదే!
Shraddha walker: ప్రేమించిన వ్యక్తి చేతిలో అత్యంత దారుణంగా హత్యకు గురైన శ్రద్ధా వాకర్ కేసు దేశ వ్యాప్తంగా కలకలం రేపిన విషయం విదితమే. రెండేళ్ల క్రితం ఢిల్లీలో తాను సహజీవనం చేస్తున్న అఫ్తాబ్ అనే యువకుడి చేతిలో కిరాతకంగా హత్య చేయబడింది శ్రద్ధా వాకర్. ఆమెను హత్య చేసిన అఫ్తాబ్.. మృతదేహాన్ని ముక్కలుగా నరికి ఢిల్లీ శివారులో పారేశాడు.
కాగా, శ్రద్ధా వాకర్ తండ్రి వికాస్ వాకర్ ముంబైలోని వాసాయి ప్రాంతంలో గుండెపోటుతో మరణించారు. తన కుమార్తె శ్రద్ధా వాకర్ మరణానికి న్యాయం చేయాలని వేడుకున్న ఆయన.. తనకు కావాల్సిన న్యాయం దొరక్కముందే చనిపోవడం విషాదంగా మారింది. సన్నిహితులు తెలిపిన వివరాల ప్రకారం.. తన కుమార్తె శ్రద్ధా వాకర్ హత్య గురైన ఘటన నుంచి వికాస్ ఇప్పటికే షాక్‌లోనే ఉన్నారన్నారు.

నిజానికి శ్రద్ధా వాకర్ కనిపించడం లేదంటూ వికాస్ వాకర్ చేసిన ఫిర్యాదు ద్వారానే ఆమె హత్య విషయం వెలుగుచూడటం గమనార్హం. శద్ధా తండ్రి వికాస్ వాకర్ కూతురి అస్థికలను దహనం చేయాలనుకున్నాడు. కానీ, చాలా కాలంగా కోర్టులో కేసు విచారణలోనే ఉండటం వల్ల అది సాధ్యం కాలేదు. కుమార్తె శ్రద్ధా వాకర్ అస్థికలు కూడా ఆయనకు దొరక్కపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యాడు.
2022, మే 18న జరిగిన శ్రద్దా వాకర్ హత్య ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. శ్రద్ధా వాకర్ ను హత్య చేసిన ఆరు నెలల తర్వాత నిందితుడు అఫ్తాబ్ ను పోలీసులు అరెస్ట్ చేయడం గమనార్హం. శ్రద్ధా వాకర్‌ను దారుణంగా హత్య చేసిన అఫ్తాబ్.. ఆమె శరీర భాగాలను ముక్కలు చేసి రోజుల తరబడి ఫ్రిజ్‌లో ఉంచాడు. ఆ తర్వాత సూట్ కేసులో వాటిని తీసుకెళ్లి ఢిల్లీ శివారు ప్రాంతాల్లో పారేశాడు. ప్రస్తుతం అఫ్తాబ్ ఢిల్లీ జైలులో ఉన్నాడు. ఇప్పటికీ అతడికి ఎలాంటి శిక్ష విధించలేదు. అయితే, చివరకు తన కూతురు అస్థికలు కూడా చూడకుండానే శ్రద్ధా వాకర్ తండ్రి మరణించడంతో విషాదం నెలకొంది.












Click it and Unblock the Notifications