SI exam scam: ఫ్లాట్ పోయింది, ఉద్యోగం పోయింది, తండ్రీ కొడుకులు జైలుపాలు, అసలు మ్యాటర్ !
బెంగళూరు/ కలబురిగి: కర్ణాటక రాజకీయాలను కుదిపేసి సబ్ ఇన్స్ పెక్టర్ ఉద్యోగాల నియామకం పరీక్షల గోల్ మాల్ వ్యవహారంలో రోజుకు ఒకరిని అరెస్టు చేస్తున్న సీఐడీ అధికారులు ఈ దందాతో లింక్ ఉన్న వారికి నిద్రలేకుండా చేస్తున్నారు. ఎస్ఐ ఉద్యోగాల రాతపరీక్షల గోల్ మాల్ వ్యవహారంలో తండ్రీ కొడుకును పోలీసులు అరెస్టు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.
కొడుకుకు ఎస్ఐ ఉద్యోగం వస్తుందని, అతను జీవితంలో సెటిల్ అయిపోతాడని కలలుకన్న ఆ తండ్రి ఉన్న సొంత ఫ్లాట్ అమ్మి రూ. 50 లక్షలు మధ్యవర్తుల చేతిలో పెట్టాడు. దెబ్బకు ఎస్ఐ పరీక్షల గోల్ మాల్ వ్యవహారం బయటకు రావడంతో ఫ్లాట్ తో పాటు కొడుకు ఎస్ఐ ఉద్యోగం పోవడంతో ఆ తండ్రి హడలిపోయాడు.

డబ్బు, ఉద్యోగం పోతేపోయింది, కేసు నుంచి తప్పించుకోవాలని అనేక ప్రయత్నాలు చేసిన తండ్రీ కొడుకు ఇప్పుడు అరెస్టు అయ్యి జైలుపాలైనారు. కలబురిగిలోని రాజాపూర లేఔట్ లో శరణప్ప అనే ఆయన నివాసం ఉంటున్నాడు. శరణప్ప కొడుకు ప్రభు ఎస్ఐ కావాలని కలకలు కన్నాడు.
శరణప్పను కలిసిన మధ్యవర్తి చంద్రకాత్ నువ్వు రూ. 50 లక్షలు ఇస్తే నీ కొడుకును ఎస్ఐ ఉద్యోగంలో పాస్ చేయిస్తానని, ఎస్ఐ ఉద్యోగం వస్తే కోట్ల రూపాయాల డబ్బులు సంపాధిస్తాడని నమ్మించాడు. చంద్రకాంత్ మాటలు నమ్మిన శరణప్ప రాజాపురలోని సొంత ఫ్లాట్ ను రూ. 35 లక్షలకు విక్రయించి అందులో రూ. 30 లక్షలను చంద్రకాంత్ కు అడ్వాన్స్ గా ఇచ్చాడు. బ్లూటూత్ సహాయంతో ఎస్ఐ ఉద్యోగానికి ప్రభు రాతపరీక్షలు రాశాడు.
అయితే టైమ్ బాగా లేకపోవడంతో ఎస్ఐ పరీక్షల గోల్ మాల్ వ్యవహారం బయటకు రావడం, బీజేపీ నాయకురాలు దివ్యాతో పాటు అనేక మంది అరెస్టు అయ్యారు. ఇప్పుడు ఎస్ఐ పరీక్షల్లో కొడుకును పాస్ చేయించాలని చంద్రకాంత్ కు రూ. 50 లక్షలు ఇచ్చిన శరణప్ప, ఆయన కొడకు ప్రభు అరెస్టు కావడంతో వాళ్ల కుటుంబ సభ్యులు హడలిపోయారు.












Click it and Unblock the Notifications