నాకు సంబంధం లేదని సిద్దరామయ్య ధైర్యంగా చెప్పగలరా ?, బాంబు పేల్చిన సుధాకర్ !
బెంగళూరు/న్యూఢిల్లీ: ఎలాగైనా సీఎం పదవి దక్కించుకుని బెంగళూరు వచ్చి ప్రమాణస్వీకారం చెయ్యాలని కలకలు కంటున్న మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య మీద బీజేపీ మాజీ మంత్రి డాక్టర్ సుధాకర్ సంచలన ఆరోపణలు చేశారు. 2019లో కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిపోవడానికి, తనకు ఎలాంటి సంబంధం లేదని మాజీ సీఎం సిద్దరామయ్య ధైర్యంగా చెప్పగలరా అని డాక్టర్ సుధాకర్ ప్రశ్నించారు.
ఇప్పటికే డీకే శివకుమార్ పోటీతో నానా ఇబ్బందులు ఎదుర్కొంటూ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ దగ్గర మంచి మార్కులు కొట్టేసి సీఎం సీటు సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తున్న సిద్దరామయ్య నెత్తిన బండరాయి వేసిన డాక్టర్ సుధాకర్ బాల్ ను కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్ లో విసిరేయడం ఇప్పుడు కర్ణాటక రాజకీయాల్లో కలకలం రేపింది.

డాక్టర్ సుధాకర్ బుధవారం చేసిన ట్విట్ లో 2018 అసెంబ్లీ ఎన్నికల తరువాత జరిగిన పరిణామాలు, 2019లో సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయిన విషయాన్ని ప్రస్తావించడం ఇప్పుడు సిద్దరామయ్యకు సమస్యగా మారింది. 2018 అసెంబ్లీ ఎన్నికల తరువాత కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది.
బీజేపీ మాజీ మంత్రి డాక్టర్ సుధాకర్ 2018లో కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. సంకీర్ణ ప్రభుత్వం సవ్యంగా సాగడానికి సిద్దరామయ్యను సమన్వయ సమితి అధ్యక్షుడిగా నియమించారు. సంకీర్ణ ప్రభుత్వంలో తమకు అన్యాయం జరుగుతోందని, మా పనులు ఏమాత్రం జరగడంలేదని, మీరే న్యాయం చెయ్యాలని తనతో పాటు కొంత మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సిద్దరామయ్య దగ్గరకు వెళ్లి విషయం చెప్పామని డాక్టర్ సుధాకర్ గుర్తు చేశారు.
ఆ సమయంలో తన నియోజక వర్గంలో, తన జిల్లాలో తన పనులు కూడా జరగడంలేదని సిద్దరామయ్య అప్పటి అసమ్మతి ఎమ్మెల్యే ముందు అసహనం వ్యక్తం చేశారని డాక్టర్ సుధాకర్ అన్నారు. 2019 లోక్ సభ ఎన్నికలు పూర్తి అయిన మరుసటి రోజే కుమారస్వామి సీఎంగా ఉన్న ఈ సంకీర్ణ ప్రభుత్వాన్ని వదిలిపెట్టనని, వీళ్ల అంతు చూస్తానని సిద్దరామయ్య అప్పట్లో అసమ్మతి ఎమ్మెల్యేల ముందే మండిపడ్డారని డాక్టర్ సుధాకర్ ఆరోపించారు.

మా నియోజక వర్గాల ప్రజల మీద నమ్మకంతో ఉప ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించిన 17 మంది అసమ్మతి ఎమ్మెల్యేలు సంకీర్ణ ప్రభుత్వం మీద తిరుబాటు చేసి తరువాత బీజేపీకి మద్దతు ఇచ్చామని, తరువాత మేము అందరూ రాజీనామాలు చేసి ఉప ఎన్నికలకు వెళ్లామని, తరువాత మంత్రులు అయ్యామని బీజేపీ మాజీ మంత్రి డాక్టర్ సుధాకర్ అన్నారు.
2019లో కర్ణాటకలోని కాంగ్రెస్-జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిపోవడానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా తనకు సంబంధం లేదు అని సిద్దరామయ్య ధైర్యంగా చెప్పగలరా అంటూ ఈరోజు మాజీ మంత్రి డాక్టర్ సుధాకర్ ట్విట్ చెయ్యడం కర్ణాటకలో కలకలం రేపింది. సీఎం కావాలనుకుంటున్న సిద్దరామయ్య గతంలో సంకీర్ణ ప్రభుత్వానికి ద్రోహం చేశారని డాక్టర్ సుధాకర్ పరోక్షంగా ఆరోపించారు. కర్ణాటకలో ఒక్కలిగ వర్గానికి చెందిన నాయకుడు సీఎం అవుతారని ఇటీవల డాక్టర్ సుధాకర్ ట్విట్ చెయ్యడం కర్ణాటక రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!












Click it and Unblock the Notifications