సిద్దరామయ్యకు మెడకు వేలాడుతున్న కొత్త వివాదం..
బెంగుళూరు : కర్ణాటక సీఎం సిద్దరామయ్యను వివాదాలు వెంటాడుతున్నాయి. బెంగుళూరు టర్ఫ్ క్లబ్ (బీటీసీ) కు స్టివార్డ్ నియామకం విషయంలో రుణాల రూపేనా సిద్దరామయ్యకు, స్టివార్డ్ గా నామినేట్ అయిన వివేకానందకు మధ్య లావాదేవీలు జరిగాయన్న ఆరోపణ ఆయన తాజా వివాదానికి కేంద్రబిందువుగా మారింది.
బెంగుళూరు టర్ఫ్ క్లబ్ స్టివార్డ్ గా ఎల్.వివేకానంద నామినేషన్ దాఖలు చేయగా, ఆయనతో ఆర్థిక సిద్దరామయ్య ఆర్థిక లావాదేవీలు కుదుర్చుకున్నారని ఎస్.భాస్కరన్ అనే ఓ సామాజిక కార్యకర్త ఆరోపిస్తున్నారు. దీనిపై పలు ఆధారాలను కూడా సేకరించిన భాస్కరన్ ఈ విషయంలో గవర్నర్ జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు.

స్టివార్డ్ గా నామినేట్ చేసినందుకు గాను రూ. 1.3 కోట్ల రుణాన్ని వివేకానంద దగ్గరి నుంచి తీసుకున్నారని భాస్కరన్ ఆరోపిస్తున్నారు. ముఖ్యమంత్రి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపిస్తున్న భాస్కరన్, దీనికి సంబంధించిన పలు సాక్ష్యాలను గవర్నర్ కి పంపించినట్టుగా సమాచారం.
కాగా, దీనిపై స్పందించిన వివేకానంద మాత్రం భాస్కరన్ ఆరోపణలను కొట్టిపారేశారు. సీఎంకి తనకు మధ్య ఎలాంటి లావాదేవీలు లేవని స్పష్టం చేసిన ఆయన, తనను నామినేట్ చేసినందుకు సిద్దరామయ్య తన వద్ద నుంచి రుణం పొందారన్న ఆరోపణలను ఖండించారు.












Click it and Unblock the Notifications