Aryan Khan drugs case: వసూళ్ల కోసం సమీర్ వాంఖెడె ప్రైవేట్ ఆర్మీ
ముంబై: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ముంబై క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ లభించిన అనంతరం రాజకీయ వేడి రాజుకుంది. అధికార మహా వికాస్ అఘాడీ, ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ నాయకుల మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. విమర్శలు-ప్రతి విమర్శలు, ఆరోపణలు-ప్రత్యారోపణలతో మహారాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారి సమీర్ వాంఖెడె కేంద్రబిందువుగా ఈ దాడి కొనసాగుతోంది.

వాంఖెడె చుట్టూ..
క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసును బట్టబయలు చేసిన ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖెడె చుట్టూ ప్రస్తుతం మహారాష్ట్ర రాజకీయాలు సాగుతున్నాయి. ఆర్యన్ ఖాన్ సహా ఇతర సెలెబ్రిటీల పిల్లలను ఈ కేసు నుంచి గట్టెక్కించడానికి సమీర్ వాంఖెడె 25 కోట్ల రూపాయలను డిమాండ్ చేశారంటూ సాక్ష్యాధారాలతో సహా బయటపెట్టే ప్రయత్నం చేస్తోంది నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ. ఇదివరకు తెల్ల కాగితంపై ఆర్యన్ ఖాన్ సంతకాన్ని తీసుకోవడం, ఈ కేసులో ఓ పాత నేరస్తుడి ప్రమేయం ఉండటం వంటివి ఉదాహరణగా చూపిస్తోంది.

డ్రగ్స్ కేసులను డీల్ చేయడానికి..
తాజాగా ఎన్సీపీ సీనియర్ నేత, మంత్రి నవాబ్ మాలిక్.. అదే ఆరోపణ చేశారు. నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరోలో సమీర్ వాంఖెడె ప్రత్యేకంగా ఓ ప్రైవేటు ఆర్మీని ఏర్పాటు చేసుకున్నారని ఆరోపించారు. సెలెబ్రిటీల డ్రగ్స్ కేసులను తన ప్రైవేట్ ఆర్మీతో డీల్ చేయిస్తున్నాడని మండిపడ్డారు. కిరణ్ గోసావి, సామ్ డిసౌజా, భానుషాలి, ఫ్లెచర్ పటేల్, ఆదిల్ ఉస్మాని, లకు ఈ కేసుతో ఏం పని అంటూ ఆయన ప్రశ్నించారు. ప్రబాకర్ సెయిల్.. 18 కోట్ల రూపాయలను డిమాండ్ చేశాడనడానికి ఇదివరకే సాక్ష్యాధారాలు కూడా వెలుగులోకి వచ్చాయని అన్నారు.

పాత నేరస్తుడికి ఎన్సీబీ ఆఫీస్‌లో ఏం పని?
ఈ ఉదయం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సమీర్ వాంఖెడె- కోట్ల రూపాయలను డిమాండ్ చేశారంటూ సామ్ డిసౌజా అంగీకరించారని గుర్తు చేశారు. క్రూయిజ్ షిప్ కేసులో ఎన్సీబీ అధికారుల ప్రమేయం లేదంటూ సమీర్ వాంఖెడె చెబుతున్నారని, క్రిమినల్ కేసులు ఉన్న కిరణ్ గోసావిని ఎందుకు తెరపైకి తీసుకొచ్చారని, అతనికి ఈ కేసుతో సంబంధం ఏమిటని నిలదీశారు. తనకు అండర్ వరల్డ్ మాఫియాతో సంబంధం ఉందంటూ మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆరోపించడంలో అర్థం లేదని అన్నారు.

వాంఖెడె వార్డ్ రోబ్‌లో
సమీర్ వాంఖెడె వార్డ్ రోబ్‌లో కనీసం అయిదు కోట్ల రూపాయల విలువ చేసే దుస్తులు ఉన్నాయని, దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలు తన వద్ద ఉన్నాయని నవాబ్ మాలిక్ అన్నారు. క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసు బట్టబయలు కావడానికి ముందు సమీర్ వాంఖెడె మాల్దీవుల ట్రిప్‌కు వెల్లొచ్చారని చెప్పారు. అతనికి ఇంత ఆస్తి ఎక్కడిదనే విషయంపై బీజేపీ నాయకులు సమాధానం చెప్పగలరా? అని ప్రశ్నించారు. వాంఖెడెపై చేసిన ఆరోపణల నుంచి తాను వెనక్కి తగ్గబోనని అన్నారు.
Recommended Video

15 కోట్ల రూపాయలు చేతులు మారేలా..
బీజేపీ ప్రభుత్వ హయాంలో ముంబై ఫోర్ సీజన్స్ హోటల్‌లో బీజేపీ నాయకులు ఎందుకు తరచూ పార్టీలను నిర్వహించేవారని, ఇందులో ఒక్కో టేబుల్ మీద 15 లక్షల రూపాయల మేర ముడుపులు చేతులు మారేవని విమర్శించారు. ఈ విషయం దేవేంద్ర ఫడ్నవీస్‌కు కూడా తెలుసని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తరువాత అలాంటి ఖరీదైన పార్టీలకు బ్రేక్ పడిందని అన్నారు. ఒక్కో సెల్రబేషన్ పార్టీలో 15 కోట్ల రూపాయలు చేతులు మారేవని చెప్పారు.












Click it and Unblock the Notifications