వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీలోకి బల్లే బల్లే: లోక్ సభ టికెట్ ఖాయమేనా?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కాషాయ పార్టీకి సినీ గ్లామర్ తోడువుతోంది. నిన్నటికి నిన్న బాలీవుడ్ రోరింగ్ లయన్ సన్నీ డియోల్ భారతీయ జనతాపార్టీలో చేరారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పంజాబ్ లోని గురుదాస్ పూర్ నియోజకవర్గం నుంచి బెర్త్ ఖాయం చేసుకున్నారు. ప్రముఖ సూఫీ గాయకుడు హన్స్ రాజ్ హన్స్ కూడా అలా బీజేపీలో చేరారో లేదో.. ఇలా లోక్ సభ టికెట్ తెచ్చేసుకున్నారు. వాయవ్య ఢిల్లీ నుంచి పోటీ చేస్తున్నారు. భారత క్రికెట్ జట్టు మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ పరిస్థితీ అంతే. పార్టీలో చేరిన వెంటనే ఆయన తూర్పు ఢిల్లీ అభ్యర్థిగా ఖాయం చేసుకున్నారు. ఈ జాబితాలో మరో సెలెబ్రిటీ చేరారు. ఆయనే పంజాబీ పాప్ సింగర్ దలేర్ మెహందీ.

నోట్రెడామ్ చర్చిలో అగ్నికీలల వెనుక.. దిగ్భ్రాంతిని కలిగించే కారణాలు! <br>నోట్రెడామ్ చర్చిలో అగ్నికీలల వెనుక.. దిగ్భ్రాంతిని కలిగించే కారణాలు!

Singer Daler Mehndi joins BJP ahead of Lok Sabha elections in Punjab

దాదాపు అన్ని భాషల్లోనూ ఆయన పాటలు పాడారు. బాహుబలి-2 టైటిల్ సాంగ్ తెలుగులో చిరస్మరణీయంగా మిగిలిపోయే పాట. తెలుగు, తమిళం, ఒరియా, హిందీ భాషల్లో దలేర్ మెహందీ అనేక పాటలు పాడారు. సినీ పాటలతో పాటు ప్రైవేట్ ఆల్బమ్ ల ద్వారా కూడా ఆయన పేరు తెచ్చుకున్నారు. రెండు దశాబ్దాల క్రితం బోలో తారారార.. హో జాయేగీ బల్లేబల్లే అంటూ దలేర్ విడుదల చేసిన ఆల్బమ్స్ ఓ ఊపు ఊపాయి. ఇన్నాళ్లూ సినీ పరిశ్రమకే పరిమితమైన ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. బీజేపీ తీర్థాన్ని పుచ్చుకున్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేేసే అవకాశాలు కూడా లేకపోలేదు.

Singer Daler Mehndi joins BJP ahead of Lok Sabha elections in Punjab

శుక్రవారం ఉదయం దలేర్.. న్యూఢిల్లీలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో కేంద్రమంత్రులు డాక్టర్ హర్షవర్ధన్, మనోజ్ తివారీ, విజయ్ గోయల్ సమక్షంలో బీజేపీ కండువా కప్పుకొన్నారు. ఆ సమయంలో ఆయన వెంట సూఫీ గాయకుడు హన్స్ రాజ్ హన్స్ ఉన్నారు. నిజానికి- దలేర్ మెహందీ, హన్స్ రాజ్ హన్స్ వియ్యంకులు. దలేర్ మెహందీ కుమార్తెను హన్స్ రాజ్ హన్స్ కుమారుడు పెళ్లి చేసుకున్నారు. దలేర్ బీజేపీ తీర్థాన్ని తీసుకోవడం వెనుక హన్స్ రాజ్ ప్రమేయం ఉందని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో పంజాబ్ లోని ఏదైనా లోక్ సభ స్థానం నుంచి దలేర్ పోటీ చేయవచ్చని తెలుస్తోంది.

English summary
After Bollywood star Sunny Deol, Sufi singer Hans Raj Hans and cricketer Gautam Gambhir, Punjabi and Hindi singer Daler Mehndi is the latest celebrity to take the saffron plunge ahead of the Lok Sabha elections. He joined the party in the presence of Union Minister Vijay Goel, Delhi BJP chief Manoj Tiwari. BJP’s candidate from northwest Delhi constituency Hans Raj Hans, Union minister and Chandni Chowk candidate Harsh Vardhan and other party leaders were also present. Mehndi’s daughter is married to a son of Hans.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X