వైరల్ వీడియో: విష్ణుమూర్తి హంతకుడు.. దుర్గమ్మ వేశ్య అంటూ సాంగ్.. సింగర్‌పై నెటిజన్ల ఆగ్రహం
దేశవ్యాప్తంగా మరికొద్ది రోజుల్లో నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. దుర్గామాతకు 9 రోజుల పాటు ప్రత్యేక పూజలు చేసేందుకు భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌కు చెందిన ఫోక్ సింగర్ సరోజ్ సర్గం పాడిన ఒక పాట పెద్ద దుమారాన్ని రేపింది. దుర్గామాతను కించపరుస్తూ ఆమె పాడిన పాట సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఒక లైవ్ సెషన్లో హిందూ దేవతలను అవమానిస్తూ సరోజ్ సర్గం పాడిన పాట దేశవ్యాప్తంగా విమర్శలకు దారితీసింది.
దేవతలపై అసభ్యకరమైన కామెంట్స్
గాయని సరోజ్ సర్గం తన పాటలో హిందూ దేవతలపై అభ్యంతరకరమైన, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసింది. విష్ణుమూర్తిని హంతకుడిగా, దుర్గమ్మను వేశ్యగా.. ప్రహ్లాదుడిని తాగుబోతుగా ఆమె అభివర్ణించింది. అంతే కాకుండా హిందూ ఆచారాలను, పండుగలను దారుణంగా అవమానించింది. రిజర్వేషన్ల గురించి మాట్లాడుతూ రాజకీయ నాయకులపై తీవ్ర పదజాలాన్ని వాడింది. ఈ రెండు నిమిషాల పాటకు సంబంధించిన క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆమెపై తీవ్రంగా విరుచుకుపడ్డారు.

నిరసనలు, కేసు పెట్టాలని డిమాండ్లు
కేవలం జనాల దృష్టిని ఆకర్షించడానికి ఇలాంటి అసభ్యకరమైన పదాలను ఉపయోగిస్తున్నారని నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇలాంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని, మతపరమైన మనోభావాలను దెబ్బతీసినందుకు ఐపీసీ సెక్షన్ 295A కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నవరాత్రుల సమయంలో ఇలాంటి పాటలు మతపరమైన ఉద్రిక్తతలను పెంచుతాయని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
🚨 SHOCKER! Saroj Sargam INSULTS Maa Durga saying: “Durga r*ndi hai iski na tum Puja karo.”
— Megh Updates 🚨™ (@MeghUpdates) September 19, 2025
— Such abuse of Hindu faith is UNACCEPTABLE. Strictest ACTION must be taken against her. pic.twitter.com/Sr7fjHTfOj
కేసు నమోదు చేసిన పోలీసులు
హిందూ దేవుళ్లు, దేవతలపై అభ్యంతరకరమైన పాటలు పాడి అవమానించినందుకు గాయని సరోజ్ సర్గంపై మీర్జాపూర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ విషయాన్ని పోలీసులు సెప్టెంబర్ 18న ఎక్స్ వేదికగా పోస్ట్ చేసి ధ్రువీకరించారు. మడిహాన్ పోలీస్ స్టేషన్‌లో ఆమెపై కేసు నమోదు చేసి, ప్రాథమిక దర్యాప్తు జరుగుతోందని పోలీసులు వెల్లడించారు.
గతంలోనూ అభ్యంతరకర కంటెంట్
సరోజ్ సర్గంపై గతంలో కూడా హిందూ మతాన్ని లక్ష్యంగా చేసుకుని విద్వేషపూరిత కంటెంట్‌ను ప్రచారం చేసినందుకు అనేక ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి. ఆమె యూట్యూబ్ ఛానెల్‌లో హిందువులకు, ముఖ్యంగా బ్రాహ్మణులకు వ్యతిరేకంగా అనేక పాటలు ఉన్నాయి.ఆమె యూట్యూబ్‌లో పోస్ట్ చేసిన పాటల్లో హిందూ దేవతలైన శివుడు, దుర్గాదేవిపై అసభ్యకర, అభ్యంతరకర వ్యాఖ్యలు ఉన్నట్లు గుర్తించారు. సరోజ్ సర్గం 2022లో జరిగిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఛన్‌బే అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బహుజన్ ముక్తి పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications