Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Sister: లేచిపోయి లవ్ మ్యారేజ్ చేసుకున్న అక్క, తల నరికి తల్లితో కలిసి సెల్ఫీ తీసుకున్న తమ్ముడు !

ఔరంగాబాద్: వయసుకు వచ్చిన యువతి ఓ యువకుడిని ప్రేమించింది. ప్రియుడితో కలిసి ఆమె సంతోషంగా చాలాకాలం తిరిగింది. తల్లికి కూతురి ప్రేమ విషయం తెలిసింది. నువ్వు నీ ప్రియుడిని పెళ్లి చేసుకోవడం మాకు ఇష్టం లేదని, మేము చూపించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని తల్లితో పాటు తమ్ముడు ఆ యువతికి చెప్పారు. కుటుంబ సభ్యుల మాటను ఆ యువతి లెక్కచెయ్యలేదు. వివాహం చేసుకుంటే అంతా సర్దుకుంటుందని, తాను ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకోవాలని యువతి డిసైడ్ అయ్యింది. ప్రేమికులు ఇద్దరూ పెళ్లి చేసుకుని వేరుకాపురం పెట్టారు. తల్లి పెళ్లి చేసుకున్న కూతురు, అల్లుడిని ఇంటికి పిలిపించింది. భర్త ఇంట్లో ఉన్న సమయంలో అతని భార్య వంట చేస్తోంది. ఆ సమయంలో మైనర్ తమ్ముడు ఆమె ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అంతే బ్యాగ్ లో తీసుకెళ్లిన పదునైన వేటకొడవలి తీసుకున్న యువకుడు లవ్ మ్యారేజ్ చేసుకున్న అక్క తల పూర్తిగా నరికేశాడు. అక్క మొగుడిని కూడా హత్య చెయ్యడానికి అతని మీద దాడి చేశాడు. అక్క తల పూర్తిగా నరికేసి ఆ తల ఇంటి బయటకు తీసుకు వచ్చి స్థానికులు అందరికి చూపించి అతని తల్లితో కలిసి మొబైల్ ఫోన్ లో సెల్ఫీ తీసుకోవడం కలకలం రేపింది.

 కాలేజ్ లో లవర్స్

కాలేజ్ లో లవర్స్

మహారాష్ట్రలోని ఔరంగాబాద్ సమీపంలోని వైజాపూర్ లోని లడ్కాన్ గ్రామంలో 19 ఏళ్ల రష్మీ (పేరు మార్చడం జరిగింది) అనే యువతి నివాసం ఉంటున్నది. కాలేజ్ లో చదువుతున్న రష్మీకి ఆమె చదువుతున్న కాలేజ్ లో చదువుతున్న 20 సంవత్సరాల వయసు ఉన్న రాకేష్ (పేరు మార్చడం జరిగింది) యువకుడు పరిచయం అయ్యాడు.

 పెళ్లికి నో చెప్పిన తల్లి

పెళ్లికి నో చెప్పిన తల్లి

వయసుకు వచ్చిన రష్మీ, రాకేష్ ప్రేమించుకున్నారు. ప్రియుడు రాకేష్ తో కలిసి రష్మీతో చాలా సంతోషంగా తిరిగింది. రష్మీ తల్లికి ఆమె కూతురు ప్రేమ విషయం తెలిసింది. నువ్వు నీ ప్రియుడు రాకేష్ ను పెళ్లి చేసుకోవడం మాకు ఇష్టం లేదని, మేము చూపించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని తల్లితో పాటు ఆమె 17 ఏళ్ల వయసు ఉన్న తమ్ముడు రష్మీకి చెప్పారు. కుటుంబ సభ్యుల మాటను రష్మీ ఏమాత్రం లెక్కచెయ్యలేదు.

 పోలీసులను ఆశ్రయించిన ప్రేమికులు

పోలీసులను ఆశ్రయించిన ప్రేమికులు

వివాహం చేసుకుంటే అంతా సర్దుకుంటుందని, తాను ప్రేమించిన రాకేష్ ను వివాహం చేసుకోవాలని రష్మీ డిసైడ్ అయ్యింది. ప్రేమికులు ఇద్దరూ ఆదే సంవత్సరం జూన్ లో ఇంటి నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. తరువాత మాకు రక్షణ కల్పించాలని ప్రేమికులు స్థానిక పోలీసులను ఆశ్రయించారు. రాకేష్, రష్మీ కుటుంబ సభ్యులను పోలీస్ స్టేషన్ కు పిలిపించిన పోలీసులు ప్రేమికుల జోలికి రాకూడదని, మీకు ఇష్టమైతే ఇంటికి పిలిపించుకోవాలని, లేదంటే వారిని వదిలేయాలని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు.

 నమ్మించి ఇంటికి పిలిపించిన తల్లి

నమ్మించి ఇంటికి పిలిపించిన తల్లి

పోలీసులు వార్నింగ్ ఇవ్వడంతో రాకేష్, రష్మీ కుటుంబ సభ్యులు వారి జోలికి వెళ్లలేదు. అద్దె ఇంటిని తీసుకున్న రష్మీ, రాకేష్ ప్రత్యేకంగా కాపురం పెట్టి సంతోషంగా కాలం గడిపారు. జరిగిందేదో జరిగిపోయింది, ఇద్దరూ ఇంటికి రావాలని రష్మీకి ఫోన్ చేసిన ఆమె తల్లి మాయమాటలు చెప్పింది. తన తల్లి, తమ్ముడు మారిపోయారని రష్మీ గుడ్డిగా నమ్మి తల్లి ఇంటికి వెళ్లింది.

 అక్క తల పూర్తిగా నరికేసిన మైనర్ తమ్ముడు

అక్క తల పూర్తిగా నరికేసిన మైనర్ తమ్ముడు

తల్లి పెళ్లి చేసుకున్న కూతురు రష్మీ, అల్లుడు రాకేష్ ను ఆమె ఇంటికి పిలిపించింది. భర్త రాకేష్ ఇంట్లో ఉన్న సమయంలో అతని భార్య రస్మీ తల్లి ఇంటి వంటింట్లోకి వెళ్లి టీ పెట్టి వంట చేస్తోంది. ఆ సమయంలో మైనర్ తమ్ముడు ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అంతే బ్యాగ్ లో తీసుకెళ్లిన పదునైన వేటకొడవలి తీసుకున్న యువకుడు లవ్ మ్యారేజ్ చేసుకున్న అక్క రష్మీ తలను వంటింట్లోనే పూర్తిగా నరికేశాడు.

 తల నరికి సెల్ఫీ తీసుకున్న తల్లీ కొడుకు

తల నరికి సెల్ఫీ తీసుకున్న తల్లీ కొడుకు

అక్క రష్మీ మొగుడు రాకేష్ ను కూడా హత్య చెయ్యడానికి అతని మీద దాడి చేశాడు. అక్క రష్మీ తల పూర్తిగా నరికేసి ఆ తల ఇంటి బయటకు తీసుకు వచ్చి స్థానికులు అందరికి చూపించి అతని తల్లితో కలిసి మొబైల్ ఫోన్ లో సెల్ఫీ తీసుకోవడం కలకలం రేపింది. తరువాత రాకేష్ పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు.

Recommended Video

    Visakhapatnam : London Eye Now In Vizag! || Oneindia Telugu
     ఫోటో డిలీట్ చేసిన నిందితుడు

    ఫోటో డిలీట్ చేసిన నిందితుడు

    రష్మీ సోదరుడి మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకుని పరిశీలించగా ఇద్దరూ రష్మీ తలతో తీసుకున్న సెల్ఫీ ఫోటో డిలీట్ చేశారని, ఈ కేసులో ఆ ఫోటో కీలక సాక్షం కావడంతో ఆ ఫోటో రికవరీ చెయ్యడానికి ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించామని సీనియర్ పోలీసు అధికారి నిమిత్ గోయల్ మీడియాకు చెప్పారు. లవ్ మ్యారేజ్ చేసుకున్న అక్క తల నరికి చంపేసిన తమ్ముడు అతని తల్లితో కలిసి నవ్వుతూ వీదిలో సెల్ఫీ తీసుకోవడం కలకలం రేపింది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+