భర్త గడ్డం చేయించుకోవట్లేదని మరిదితో వదిన జంప్..!
పెళ్లి అనే మూడు ముళ్ల బంధాన్ని కలిసి కొనసాగించడం కంటే కూడా విడిపోవడానికే నేటి తరంలో ఎక్కువ మక్కువ చూపుతున్నారనే అనుమానం కలుగుతోంది. కలిసి బ్రతకడం కంటే కూడా విడిపోవడానికే ఎక్కువ కారణాలు వెతుకుతున్నారా అనిపిస్తుంది. పెళ్లి - విడాకులు సర్వసాధారణమైన ఈరోజుల్లో .. ఓ మహిళ చేసిన పని మాత్రం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. భర్త గడ్డం నచ్చని ఓ మహిళ.. క్లీన్‌షేవ్‌తో ఉన్న మరిదితో కలిసి ఇంటి నుంచి పరారైంది.
ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ లోని మీరట్‌లో ఓ విచిత్ర ఘటన వెలుగులోకి వచ్చింది. గడ్డం విషయంలో భార్యాభర్తల మధ్య తలెత్తిన గొడవలు చివరికి ఆమె భర్త తమ్ముడితో కలిసి జంప్ అవ్వడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మీరట్‌లోని ఉజ్వల్ గార్డెన్ కాలనీలో నివసించే మౌలానా షాకీర్, అదే ప్రాంతానికి చెందిన ఆర్షిని ఏడాది క్రితం వివాహం చేసుకున్నాడు. ఆర్షి ఇంటర్మీడియట్ పూర్తి చేసి ప్రస్తుతం డిగ్రీ చదువుతోంది.

వివాహం జరిగిన నాటి నుండి షాకీర్ గడ్డం విషయంలో ఆర్షికి అసంతృప్తి ఉండేది. గడ్డం తీయాలని ఆమె తరచూ కోరుతూ ఉండగా, షాకీర్ మాత్రం వినిపించేవాడు కాదు. ఈ చిన్న విషయమే తరచూ గొడవలకు దారి తీసింది. ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో ఎన్నోసారి పంచాయతీలు జరిగాయి. చివరికి, పెళ్లి తనకు ఇష్టం లేకుండానే జరిగిందని, భర్త గడ్డం తీయకుండా ఉంటే తానేం చేయలేనని ఆర్షి స్పష్టం చేయడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తమైంది.
ఈ క్రమంలో షాకీర్ తమ్ముడు క్లీన్ షేవ్ చేసుకుని ఆకర్షణీయంగా ఉండడాన్ని ఆమె గమనించింది. రోజులు గడిచేకొద్ది వారిద్దరి మధ్య సాన్నిహిత్యం మరింత పెరిగింది. ఫిబ్రవరి 3న, ఆర్షి తన భర్తను వదిలి అతడి తమ్ముడితో కలిసి ఇంటి నుంచి పారిపోయింది. ఇది తెలిసిన షాకీర్ కుటుంబం వారిద్దరినీ ఎక్కడికక్కడ వెతికినా కనపడకపోవడంతో చివరకు పోలీసులను ఆశ్రయించారు. తన భార్య, తమ్ముడు మిస్సింగ్ అయ్యారని ఫిర్యాదు చేశాడు షకీర్. ఇక వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. వారిద్దరి కోసం గాలిస్తున్నారు.












Click it and Unblock the Notifications